Published On:

Jupiter Transit 2025: ఈ రాశుల వారిపై గురుడి ప్రభావం.. సమస్యలు తప్పవు జాగ్రత్త !

Jupiter Transit 2025: ఈ రాశుల వారిపై గురుడి ప్రభావం.. సమస్యలు తప్పవు జాగ్రత్త !

Jupiter Transit 2025: జ్యోతిష్యశాస్త్రంలో.. బృహస్పతిని చాలా శుభప్రదమైన, ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. ఇది జ్ఞానం, ఆనందం, శ్రేయస్సు, సంపద, వైవాహిక ఆనందానికి ఒక కారకంగా పరిగణించబడుతుంది. ఈ గ్రహం ఒక వ్యక్తి జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా జీవితంలోని వివిధ రంగాలలో విజయం సాధించడానికి అతనికి సహాయపడుతుంది.

గురువు సంచారం అన్ని రాశులపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపదు. బృహస్పతి 2025 మే 14న రాత్రి 11:20 గంటలకు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని తరువాత.. అక్టోబర్ 18 న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. మే నెలలో బృహస్పతి సంచారం ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను తెస్తుంది. ఈ రాశులకు చెందిన వారు ఈ సమయంలో కొన్ని మానసిక , భావోద్వేగ ఇబ్బందులను ఎదుర్కొంటారు. బృహస్పతి సంచారం వారి రాశులపై ఎలాంటి ప్రభావం చూపబోతుందో , ఈ సమయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందామా.

మిథున రాశి: బృహస్పతి మిథున రాశిలో సంచరిస్తున్నప్పుడు ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి, ప్రతికూల ఆలోచనలు కలుగుతాయి. ఈ సమయంలో.. మిథున రాశి వారు తమ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు ప్రతికూల ఆలోచనలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సమయంలో మీ మానసిక ప్రశాంతతను ప్రభావిత చాలా వరకు ప్రభావాతిం అవుతుంది. ఈ సమస్యలను నివారించడానికి.. ధ్యానం, యోగా చేయడం చాలా మంచిది. తద్వారా సానుకూల ఆలోచనతో సమయాన్ని కొనసాగించగలరు. ఇదే కాకుండా.. ఈ కాలంలో మీరు చాలా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఇది మీ ఖర్చులను పెంచుతుంది. అంతే కాకుండా మీ జీవిత భాగస్వామితో సమన్వయం కొనసాగించడం కొంచెం కష్టంగా మారుతుంది. వ్యక్తిగత ,కుటుంబ సంబంధాలలో కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. కాబట్టి మీరు ఓపికగా, అవగాహనతో పని చేయాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి: బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారికి బాధ్యతల భారాన్ని కలిగిస్తుంది. పనిలో ఒత్తిడి పెరగుతుంది. ఇది మానసిక అలసటకు కారణం కావచ్చు. మీ ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకుని.. వాటిపై పని చేయాల్సిన సమయం ఇది. ఈ సమయంలో ఎలాంటి తొందరపాటునైనా నివారించాలి. ఎందుకంటే ఇది పనిలో సమస్యలను కలిగిస్తుంది. ఖర్చులు , ఆదాయాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం కూడా ముఖ్యం. తప్పుడు ఆర్థిక నిర్ణయాలు ఆర్థిక సమస్యలకు దారితీస్తాయి. ఆఫీసుల్లో అజాగ్రత్తను నివారించి.. పూర్తి నిజాయితీతో తమ విధులను నిర్వర్తించాలి. అలాగే.. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి.

వృశ్చిక రాశి: గురు సంచారం వృశ్చిక రాశి వారికి కెరీర్ లో మంచి అవకాశాలను తెస్తుంది. ఈ సమయంలో.. మీరు కెరీర్ లో ముఖ్య అవకాశాలను పొందుతారు. ఈ అవకాశాలను కోల్పోతే.. భవిష్యత్తులో పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వ్యక్తులు సీనియర్లు లేదా ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు మాటలు లేదా ప్రవర్తన సంబంధాలను దెబ్బతీస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. కానీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయండి. ఆలోచించకుండా ఖర్చు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త ప్రాజెక్ట్ లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం మంచిది. కానీ వారు దాని కోసం పూర్తి ప్రణాళికను రూపొందించుకోవాలి.అంతే కాకుండా ప్రతి అడుగును ఆలోచనాత్మకంగా తీసుకోవాలి.

మకర రాశి: మకర రాశి వారికి బృహస్పతి సంచారం మిశ్రమ ఫలితాలను తెస్తుంది. ఈ సమయంలో లాభం, నష్టం రెండూ ఉంటాయి. మకర రాశి వ్యక్తులు ముఖ్యమైన పని కోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే.. ఈ సమయంలో వారు విజయం సాధిస్తారు. కానీ అప్పులను తెలివిగా ఉపయోగించుకునేలా చూసుకోవాలి. ముందుగానే తిరిగి చెల్లించడానికి ప్రణాళిక వేసుకోవాలి. వ్యాపారాలు చేసే వారు ఈ సమయంలో తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాలు లభిస్తాయి. కానీ వారు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకోవాలి. వారు సరైన ప్రణాళిక లేకుండా వ్యాపారంలో తొందరపడి పెట్టుబడి పెడితే.. నష్టాలు ఎదురవుతాయి. కాబట్టి.. ఈ సమయంలో ఆర్థిక విషయాలలో మరింత జాగ్రత్తగా, తెలివిగా ఉండటం అవసరం.

ఇవి కూడా చదవండి: