Last Updated:

Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టి @18,601

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన ట్రేడింగ్‌ రోజంతా ఓ పరిమిత శ్రేణిలో ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు రానుండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు.

Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టి @18,601

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన ట్రేడింగ్‌ రోజంతా ఓ పరిమిత శ్రేణిలో ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు రానుండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. మరోవైపు ఈ వారం ప్రారంభం కానున్న అమెరికా ఫెడ్‌ సమావేశాల నేపథ్యంలో కూడా మార్కెట్లు అప్రమత్తంగా వ్యవహరించాయి.

ఉదయం సెన్సెక్స్‌ 62,659.98 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 62,804.89 నుంచి 62,615.20 మధ్య కదలాడింది. చివరకు 99.08 పాయింట్ల లాభంతో 62,724.71 దగ్గర ముగిసింది. నిఫ్టీ 18,595.05 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,633.60 నుంచి 18,559.75 మధ్య ట్రేడ్ అయింది. చివరకు 38.10 పాయింట్లు లాభపడి 18,601.50 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసేటప్పటికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 4 పైసలు పుంజుకొని 82.47 దగ్గర నిలిచింది.

 

ఏ షేర్లు లాభపడ్డాయంటే..(Stock market)

సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా స్టీల్‌ హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌, నెస్లే ఇండియా, టెక్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. నష్టపోయిన షేర్ల జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ, మారుతీ, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో బ్యాంక్‌ లు ఉన్నాయి.