Satellite Internet: “మస్క్” నుంచి మస్త్ న్యూస్.. త్వరలోనే ఏ మారుమూలకైనా “శాటిలైట్ ఇంటర్నెట్” సేవలు
ఇప్పటివరకు మనం ఇంటర్నెట్ సేవలను పలు విధాలుగా వినియోగించుకుని ఉన్నాం. కాగా త్వరలోనే దేశంలో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందనున్నాము. ఎలన్ మస్క్ ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది.
Satellite Internet: ఇప్పటివరకు మనం ఇంటర్నెట్ సేవలను పలు విధాలుగా వినియోగించుకుని ఉన్నాం. కాగా త్వరలోనే దేశంలో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందనున్నాము. ఎలన్ మస్క్ ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. దీనికోసం ‘స్టార్‌లింక్’సంస్థ కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. కేంద్రం అనుమతిస్తే మరకొద్ది రోజుల్లోనే ఈ ఇంటర్నెట్ సేవలు మొదలవుతాయి.
ఎలన్ మస్క్ స్టార్ లింక్ సంస్థ వారు ‘గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ సర్వీసెస్ (జీఎంపీసీఎస్) లైసెన్స్’ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా దీనికి సంబంధించిన కేంద్రం నుంచి అనుమతులు వస్తే మన దేశంలో స్టార్‌లింక్ సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. స్పేస్ ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఇది. అంటే కేబుల్ లేదా మొబైల్ టవర్లు వంటివి లేకుండానే ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చనమాట. దీని కోసం స్పేస్ ఎక్స్ సంస్థ ప్రత్యేక డివైజ్‌ను రూపొందించింది. దీని ద్వారా ఏ మారుమూల గ్రామమైనా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. నిజానికి గత ఏడాదే దీని అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, వివిధ కారణాల వల్ల ఆ దరఖాస్తులను కంపెనీ తిరిగి వెనక్కు తీసుకుంది.
అయితే తాజాగా మరోసారి ఈ సేవల్ని ప్రారంభించేందుకు ఎలన్ మస్క్ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ సంస్థ ఒక్కటే ఈ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలకు దరఖాస్తు చేసుకుంది. అయితే భవిష్యత్తులో రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, కెనడాకు చెందిన టెలిశాట్, అమెజాన్ వంటివి కూడా ఈ సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు.
ఇదీ చదవండి: యాపిల్‌కు రూ. 150 కోట్ల జరిమాన..!