Last Updated:

Elon Musk: మరో ప్రముఖ కంపెనీని సొంతం చేసుకోనున్న ఎలాన్‌ మస్క్‌.. అది ఏంటంటే..?

మస్క్ మరో కంపెనీని కూడా కొనెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు తెస్తోంది. మరి ఆ కంపెనీ ఏంటి దానిని ఎందుకు మస్క్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారో ఓ సారి చూసేద్దాం.

Elon Musk: మరో ప్రముఖ కంపెనీని సొంతం చేసుకోనున్న ఎలాన్‌ మస్క్‌.. అది ఏంటంటే..?

Elon Musk: ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ ఇటీవల ట్విట్టర్ ను సొంతం చేసుకుని మైక్రోబ్లాంగింగ్ సైట్లో అనేక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా మస్క్ మరో కంపెనీని కూడా కొనెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు తెస్తోంది. మరి ఆ కంపెనీ ఏంటి దానిని ఎందుకు మస్క్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారో ఓ సారి చూసేద్దాం

1995 లో జిప్‌ 2 అనే సంస్థను స్థాపించిన ఎలాన్‌ మస్క్‌.. ఇప్పటికి ఆరు అంతర్జాతీయ సంస్థలకు ఓనర్ గా ఉన్నారు. వాటిలో ముఖ్యంగా టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ వంటి ఉన్నాయి. కాగా ఇటీవలె మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ను కూడా తన కంపెనీల జాబితాలో చేర్చుకున్నాడు. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ను కొనుగోలు చేసి దానిలో అనేక మార్పులు చేర్పులు చేశారు. లాభదాయకమైన వ్యాపారం చేయాలన్న లక్ష్యంతో ట్విట్టర్‌లో బ్లూ టిక్‌ సేవలను 8 డాలర్లకు చెల్లించాలని నిబంధన పెట్టారు.

ఇకపోతే ఇప్పుడు మరో అమెరికా బేస్డ్‌ కంపెనీని కొనుగోలు చేసేందుకు ఎలాన్‌ మస్క్‌ సిద్ధమైనట్లు సమాచారం. ఈసారి కార్పొరేట్‌ మీడియాను కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. అమెరికా బేస్డ్‌ ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాం అయిన సబ్‌స్టాక్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. 2017 లో స్థాపించిన సబ్‌స్టాక్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం రచయితలు తమ డిజిటల్‌ వార్తాలేఖలను నేరుగా చందాదారులకు పంపేందుకు అనుమతిస్తుంది. కాగా వాల్‌స్ట్రీట్ సిల్వర్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌కు మస్క్ ఈ విషయమై తన ఆలోచనను వెల్లడించినట్లు పోస్టులను బట్టి అర్ధమవుతుంది.

ఇదీ చదవండి: ఒకప్పుడు నో ఎంట్రీ.. ఇప్పుడు వెల్‌కమ్ తెలంగాణలో చంద్రబాబుపై కేసీఆర్ వ్యూహం ఎందుకు మారింది?

 

ఇవి కూడా చదవండి: