Last Updated:

5G Net Speed: 5జీ స్పీడ్ టెస్ట్ లో అదరగొట్టిన జియో.. డౌన్లోడ్ స్పీడ్ ఎంతో తెలుసా..?

5జీ సేవలను పలు మెట్రో నగరాల్లో జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులకు అందిస్తున్నాయి. కాగా 4జీతో పోల్చితే 5జీ నెట్ స్పీడ్ పదింతలు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో 5G డౌన్లోడ్ స్పీడ్ అసలు ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఓక్లా ఓ టెస్ట్ చేసింది. ఈ టెస్టులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

5G Net Speed: 5జీ స్పీడ్ టెస్ట్ లో అదరగొట్టిన జియో.. డౌన్లోడ్ స్పీడ్ ఎంతో తెలుసా..?

5G Net Speed: దేశంలో ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూసిన 5G సేవలు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. కాగా పలు మెట్రో నగరాల్లో జియో, ఎయిర్‌టెల్ ఈ సేవలను వినియోగదారులకు అందిస్తున్నాయి. కాగా 4జీతో పోల్చితే 5జీ నెట్ స్పీడ్ పదింతలు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో 5G డౌన్లోడ్ స్పీడ్ అసలు ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఓక్లా ఓ టెస్ట్ చేసింది. ఈ టెస్టులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

5జీ వేగంలో రిలయన్స్ జియో ఏ సంస్థకూ అందనంత ఎత్తుల నిలిచింది. రిలయన్స్ జియో 598.58 ఎంబీపీఎస్ డౌన్ లోడింగ్ వేగాన్ని నమోదు చేసిందని, ఆ తర్వాత ఎయిర్ టెల్ నెట్ వర్క్ డౌన్ లోడ్ వేగం 197.98 ఎంబీపీఎస్ గా ఉందని ఓక్లా గణాంకాలను వెల్లడించింది. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, వారణాసి ప్రాంతాల్లో జూన్ నుంచి ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలిపింది.

అక్టోబర్ 1న 5జీ సేవలు మొదలు కాగా, దీనికంటే ముందే టెలికం ఆపరేటర్లు తమ నెట్ వర్క్ డౌన్లోడ్ స్వీడ్ లను పరీక్షించినట్టు ఓక్లా తెలిపింది. ఆ సమయంలో 16.27 ఎంబీపీఎస్ నుంచి 809.94 ఎంబీపీఎస్ వరకు వేగం నమోదు అయినట్టు వెల్లడించింది. పట్టణాల వారీగానూ టెలికం నెట్ వర్క్ ల 5జీ డౌన్ లోడ్ లో వ్యత్యాసాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: బాణాసంచాపై ఆంక్షలు.. 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చాలి..!

ఇవి కూడా చదవండి: