Last Updated:

April 2025 Car Launches: ఏప్రిల్‌లో మార్కెట్‌లో కార్ల జాతర.. ఫీచర్స్‌లో టాప్‌ అండ్‌ బెస్ట్‌ ఇవే..!

April 2025 Car Launches: ఏప్రిల్‌లో మార్కెట్‌లో కార్ల జాతర.. ఫీచర్స్‌లో టాప్‌ అండ్‌ బెస్ట్‌ ఇవే..!

April 2025 Car Launches: భారత మార్కెట్‌లో ప్రతి నెలా లక్షల యూనిట్ల కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ కార్లను తయారీదారులు వివిధ ఫీచర్లు, సాంకేతికత, ధరలతో వివిధ విభాగాలలో అందిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 2025లో ఏ సెగ్మెంట్‌లో ఏ కారును లాంచ్ చేయచ్చు. లాంచ్ చేసే సమయంలో వాటి ధర ఎంత ఉంటుంది? తదితర వివరాలు తెలుసుకుందాం.

 

Nissan Magnite CNG
మాగ్నైట్‌ను జపనీస్ ఆటోమేకర్ నిస్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో విక్రయిస్తోంది. నివేదికల ప్రకారం.. ఈ ఎస్‌యూవీ సీఎన్‌జీ వెర్షన్‌ను ఏప్రిల్ 2025లో విడుదల చేయచ్చు. దీని గురించి నిస్సాన్ ఇంకా సమాచారం ఇవ్వనప్పటికీ.. ఈ ఎస్‌యూవీని డీలర్‌షిప్ స్థాయిలో సీఎన్‌జీ కిట్‌తో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. పెట్రోల్ వెర్షన్ తో పోలిస్తే సీఎన్‌జీ వెర్షన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.70 నుంచి 80 వేలు పెరగవచ్చు.

 

Volkswagen Tiguan R Line
ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ వెర్షన్‌ను ఫుల్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఎస్‌యూవీ బుకింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. సాధారణ టిగువాన్‌తో పోల్చితే, ఆర్-లైన్ అనేక మెరుగైన ఫీచర్లను అందిస్తుంది. అందులో చాలా మార్పులు కూడా చేయనున్నారు. ఇది అధికారికంగా 14 ఏప్రిల్ 2025న భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది.

 

MG Cyberster
సైబర్‌స్టార్‌ను బ్రిటిష్ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ ఏప్రిల్ 2025లో విడుదల చేయచ్చు. దీని గురించి ఇంకా అధికారిక సమాచారం ఇవ్వనప్పటికీ.. ఈ ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్‌ను ఏప్రిల్ చివరిలో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. విడుదల సమయంలో దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.75 లక్షలు ఉండచ్చు.

 

MG M9
సైబర్‌స్టార్‌తో పాటు, M9 ఎలక్ట్రిక్ ఎమ్‌పీవి కూడా ఏప్రిల్ 2025లో ఎంజీ ప్రారంభించవచ్చు. ఈ ఎమ్‌పీవీ ప్రీమియం ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో విడుదల కానుంది. ఈ రెండు కార్లను జనవరి 2025లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో MG ప్రదర్శించింది.

 

Maruti E Vitara
నివేదికల ప్రకారం.. ఏప్రిల్ నెలలో మారుతి ఈ విటారాని మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా విడుదల చేయచ్చు. అయితే, దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారం మారుతి ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ ఎస్‌‌యూవీని జనవరి 2025లో జరిగే ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేసింది. అప్పటి నుండి దీని లాంచ్ కోసం ఎదురుచూస్తున్నారు.