Safest Family Cars Under 7 Lakhs: ఇండియా సేఫెస్ట్ కార్లు.. రూ.7 లక్షల్లోపే ఆకర్షణీయమైన ఫీచర్లు.. మైలేజ్ అదుర్స్..!
![Safest Family Cars Under 7 Lakhs: ఇండియా సేఫెస్ట్ కార్లు.. రూ.7 లక్షల్లోపే ఆకర్షణీయమైన ఫీచర్లు.. మైలేజ్ అదుర్స్..!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/Untitled-1-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-66.gif)
Safest Family Cars Under 7 Lakhs: కార్లలో భద్రతా ఫీచర్లు ఇప్పుడు చాలా ముఖ్యమైనవిగా మారాయి. ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న దాదాపు అన్ని కార్లు స్టాండర్డ్ ఫీచర్లుగా ABS + EBDతో పాటు 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో వస్తున్నాయి. వాస్తవానికి కార్లలో పూర్తి భద్రత కల్పించాలని తయారీదారులపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో ఇదంతా జరుగుతోంది. మీ బడ్జెట్ రూ. 7 లక్షల వరకు ఉంటే.. బెస్ట్ సేఫ్టీ కార్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
TATA Tiago
టాటా టియాగో తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన కారు. ఈ కారు భద్రతలో 4 స్టార్ రేటింగ్ సాధించింది. ఇది బలమైన హ్యాచ్‌బ్యాక్ కారు. దీని గురించి మాట్లాడితే కొత్త టియాగోలో 3 సిలిండర్లు, 1.2L పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది, ఇది 5 స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఈ కారులో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో,ఆపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్, నట్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ EBD,ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. టియాగో ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
Tata Punch
7 లక్షలలోపు టాటా పంచ్ బెటర్ ఆప్షన్. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.6.13 లక్షల నుండి ప్రారంభమవుతుంది. తక్కువ బడ్జెట్‌లో వస్తున్న పంచ్ సేఫ్టీ పరంగా టాప్‌లో ఉంది. భద్రత విషయంలో 5 స్టార్ రేటింగ్ కూడా సాధించింది. పంచ్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 86పిఎస్ పవర్, 113ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ కారు ఒక లీటర్‌లో 18.82 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. భద్రత కోసం, ఇందులో 2 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. పంచ్ దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV. దీని డిజైన్ ఆకట్టుకోనప్పటికీ, స్పేస్, సేఫ్టీ ఫీచర్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.
Nissan Magnite
నిస్సాన్ మాగ్నైట్ దాని డిజైన్ కారణంగా వినియోగదారులను ఆకర్షిస్తోంది. దీని ధర రూ.5.12 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది భద్రతలో 4 స్టార్ రేటింగ్‌ను సాధించింది. కారులో 5 మంది ప్రయాణించవచ్చు. మాగ్నైట్‌లో రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, ఇందులో 1.0లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.0లీ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజన్లు 6-స్పీడ్ MT లేదా CVT గేర్‌బాక్స్‌తో వస్తాయి. కొత్త మాగ్నైట్ మీకు 20kmpl వరకు మైలేజీని అందిస్తుంది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి.
Hyundai Exter
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ప్రారంభ ధర రూ.6.12 లక్షలు. ఇది భద్రతలో 4 స్టార్ రేటింగ్‌ను సాధించింది. డిజైన్, ఫీచర్ల పరంగా ఇది దాని విభాగంలో ఆదర్శవంతమైన కారుగా నిలుస్తుంది. ఇందులో 5 మంది కూర్చునే స్థలం ఉంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 83పిఎస్ పవర్, 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంది. ఈ కారు ఒక లీటర్‌లో 19 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి.