BYD Sealion 7 Launched: ఫిబ్రవరి 17న చైనా కారు వచ్చేస్తోంది.. ఫుల్ ఛార్జ్ చేస్తే 567 కిలోమీటర్ల రేంజ్..!
![BYD Sealion 7 Launched: ఫిబ్రవరి 17న చైనా కారు వచ్చేస్తోంది.. ఫుల్ ఛార్జ్ చేస్తే 567 కిలోమీటర్ల రేంజ్..!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/Untitled-1-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-62.gif)
BYD Sealion 7 Launched: బీవైడీ అనేది చైనా ఫేమస్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ. కంపెనీ ఇండియన్ మార్కెట్లో సీల్ ఆటో 3, ఈమ్యాక్స్ 7 పేరుతో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లు ఉండడంతో ఇవి కూడా మంచి సంఖ్యలోనే అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ మరో సరికొత్త ఎలక్ట్రిక్ కారును గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని పూర్తి సమాచారం తెలుసుకుందాం.
బీవైడీ ఇండియా గత నెల జనవరి – 2025లో ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ‘సీలియన్ 7’ ఎలక్ట్రిక్ SUVని ఆవిష్కరించింది. ‘సీల్’ ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ కారు ఫిబ్రవరి 17న అమ్మకానికి రానుంది. బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్‌లు రూ.70,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి ఈ కారును ఆర్డర్ చేయచ్చు.
కొత్త బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అడ్వాన్స్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో కనిపిస్తుంది. షార్ప్ ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు, టెయిల్‌లైట్, రేర్ డిఫ్యూజర్ ఉన్నాయి. షార్క్ గ్రే, అరోరా వైట్, అట్లాంటిస్ గ్రే, కాస్మోస్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
ఈ కారులో 82.56 కిలోవాట్ కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇందులో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ 523 బిహెచ్‌పి హార్స్ పవర్, 690 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 567 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ కారు కేవలం 4.5 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
కొత్త బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 5 సీట్లతో వస్తుంది. దీంతో ప్రయాణికులు సుదూర పట్టణాలకు హాయిగా కూర్చొని ప్రయాణించవచ్చు. లగేజీని తీసుకెళ్లేందుకు 425 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.
కొత్త సీలియన్ 7 15.6-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, పనోరమిక్ గ్లాస్ రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మ్యూజిక్ సిస్టమ్‌తో సహా వివిధ ఫీచర్లతో వస్తుంది. భద్రత కోసం 11 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.
కొత్త బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ.45 లక్షల నుండి మొదలై రూ.57 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. హ్యుందాయ్ ఐయోనిక్ 5, కియా EV6, వోల్వో XC40 మోడల్‌లు ఈ కారుకు అతిపెద్ద ప్రత్యర్థులుగా భావిస్తున్నారు.