Home /Author Guruvendhar Reddy
AP Cabinet Approves Key Decisions and Policies: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మంగళవారం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఈ మంత్రివర్గ సమావేశంలో 10 కీలక అంశాలపై లోతైన చర్చ జరిగింది. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశం పలు పాలసీలకు ఆమోదం తెలిపింది. గృహనిర్మాణం, టెక్ట్స్‌టైల్, ఐటీ, మారిటైమ్, టూరిజం పాలసీలతో బాటు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న పలు అభివృద్ధి పనుల మీద కేబినెట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ […]
Earthquakes in telugu states: తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బుధవారం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇవాళ ఉదయం 7.27 నిమిషాలకు పలు సెకన్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, గోదావరిఖని, భూపలపల్లి, చిర్ల, రంగారెడ్డి, వరంగల్, చింతకాని, భద్రాచలం ప్రాంతాలతో పాటు ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేట, విశాఖపట్నం, అక్కయ్యపాలెం, తిరువూరు, నందిగామ, పరిసర ప్రాంతాల్లో భూమి […]
CM Revanth Reddy Powerful Speech about hyderabad: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూయార్క్, టోక్యో తరహాలో ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు రూ.7వేల కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఎస్టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రైజింగ్ వేడుకల్లో సీఎం మాట్లాడారు. మెట్రో మా ఘనతే […]
Maharashtra CM to be announced after BJP’s key meet today: మహా పీఠంపై వారం రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి మంగళవారం తెరపడింది. మంగళవారం నాటి ఫడ్నవీస్, షిండే భేటీతో మరో రెండు రోజుల్లో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంలుగా పాత నేతలే కొనసాగనున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. బుధవారం నాడు నిర్వహించే బీజేపీ శాసన సభా పక్ష సమావేశంలో ఫడ్నవీస్‌ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. రేపు ముంబైలో […]
Irregularities of IPS officer Sanjay: ఏపీ సీఐడీ విభాగం మాజీ అధిపతి, ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన సమయంలో ఆ అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని కోటి రూపాయల దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కుమ్మక్కైనట్లు నిర్ధారించింది. పనుల్లో పురోగతి లేకుండానే భారీ చెల్లింపులు చేసినట్లు గుర్తించింది. నాటి నేతలకు […]
Harish Rao Fires on CM Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై నమోదైన కేసు విషయమై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనపై ఎందుకు కేసులు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ‘మిస్టర్ రేవంత్.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులు బనాయిస్తున్నావు’అని మండిపడ్డారు. ‘నువ్వు […]
PV Sindhu is getting married: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అతి త్వరలో వివాహబంధంలో అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్తసాయితో సింధు వివాహం డిసెంబరు 22న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరగనుందని, 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తామని సింధు తల్లిదండ్రులు ప్రకటించారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వెంకట దత్త సాయి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమ ఇరువురు కుటుంబాలకు ఎప్పటినుంచో పరిచయం ఉందని, వరుడు దత్తసాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారని […]
NET-TET Exams conducted same day: తెలంగాణలో మరోసారి పరీక్షల తేదీలపై గందరగోళం ఏర్పడింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిటీ టెస్టు పరీక్షలు, తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల అర్హతకు నిర్వహించే టీచర్ ఎలిజిబిటీ టెస్ట్ పరీక్షలు ఒకే టైమ్‌లో రావటం వల్ల ఈ రెండింటికీ హాజరయ్యే కొందరు విద్యార్థులు టెట్ పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకేరోజు రెండు పరీక్షలు జూనియర్ […]
3 new criminal laws to ensure justice for women: భారత రాజ్యాంగం ఆశించిన మార్పును అమలు చేసేందుకు దేశంలో అమల్లోకి వచ్చిన సరికొత్త నేర నియంత్రణ చట్టాలు అద్భుతంగా ఉపయోగనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం చండీగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్లలో దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలను జాగ్రత్తగా అధ్యయం చేసి వీటిని రూపొందించారన్నారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు […]
Ponguleti Srinivasa Reddy says Special App For Indiramma Housing Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు లేని పేదలకు తీపి కబురు చెప్పింది. ఈ నెల 5న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల యాప్‌ను ప్రారంభించబోతున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ ప్రభుత్వం పదేళ్లలో గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని విమర్శించారు. […]