Last Updated:

Samsung Galaxy S25 Ultra Launch Date: కూల్ బ్రో.. సామ్‌సంగ్ మరో అద్భుతం.. స్టన్నింగ్ లుక్స్‌తో కొత్త ఫోన్..!

Samsung Galaxy S25 Ultra Launch Date: కూల్ బ్రో.. సామ్‌సంగ్ మరో అద్భుతం.. స్టన్నింగ్ లుక్స్‌తో కొత్త ఫోన్..!

Samsung Galaxy S25 Ultra Launch Date: సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌ను వచ్చే నెలలో విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పర్ఫామెన్స్, డిస్‌ప్లే, కెమెరా, ఇతర ఫీచర్లలో అప్‌గ్రేడ్‌లతో రాబోతుంది. అలానే గెలాక్సీ సిరీస్‌లో గెలాక్సీ ఎస్25 సిరీస్‌లో ఎస్25, ఎస్ 25 ప్లస్, ఎస్ 25 అల్ట్రాలను పరిచయం చేసే అవకాశం ఉంది. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం సామ్‌సంగ్ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్‌లో గెలాక్సీ ఎస్25 స్లిమ్‌ను కూడా తీసుకురానుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి గెలాక్సీ ఎస్25 అల్ట్రాపై పడింది. ఈ నేపథ్యంలో దీని ధర, ఫీచర్లు తదితర వివరాల గురించి తెలుసుకుందాం.

లీక్‌ల ప్రకారం.. జనవరి 22, 2025న జరిగే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో Samsung Galaxy S25 సిరీస్‌ని ప్రారంభించవచ్చు. అయితే సామ్‌సంగ్ లాంచ్ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Samsung Galaxy S25 Ultra Price
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రాని రూ. 1,29,900 ధరతో విడుదల చేసే అవకాశం ఉంది. ఇది గెలాక్సీ ఎస్24 అల్ట్రా ధరతో సమానంగా ఉంటుంది. అయితే, నివేదికలు నిజమైతే సామ్‌సంగ్ డివైజ్ ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో చాలా కొత్త విషయాలు కనిపించడం దీనికి కారణం కావచ్చు. అసలు ధర తెలియాలంటే ఫోన్ లాంచ్ అయ్యే వరకు ఆగడం మంచిది.

Samsung Galaxy S25 Ultra Specifications
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రాలో 6.9-అంగుళాల AMOLED ప్యానెల్ ఉండచ్చు. ఈ స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ మొబైల్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌లో ప్రారంభించవచ్చు. ఇది కాకుండా ఇది 16GB వరకు RAMని కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంటుంది.

ఈ ఫోన్ Android 15 ఆధారిత OneUI 7పై రన్ అవుతుంది, ఇది కాకుండా మీరు దీనిలో ప్రత్యేక GalaxyAI ఫీచర్‌లను కూడా పొందవచ్చు. కెమెరా గురించి మాట్లాడితే సామ్‌సంగ్ తన ఫోన్‌ను 200MP మెయిన్ కెమెరాతో లాంచ్ చేయగలదు, ఇది కాకుండా 50MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 5x జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 3x జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్‌ని కలిగి ఉంటుంది. ఇటీవలి లీక్ అయిన నివేదికల ప్రకారం Samsung Galaxy S25 Ultra ఫోన్‌తో ఫ్రీ జెమిని అడ్వాన్స్‌డ్ సబ్‌స్క్రిప్షన్, గొరిల్లా గ్లాస్ ఆర్మర్ ప్రొటెక్షన్ మొదలైనవాటిని కూడా అందిస్తుంది.