PV Sindhu: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు
PV Sindhu is getting married: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అతి త్వరలో వివాహబంధంలో అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్తసాయితో సింధు వివాహం డిసెంబరు 22న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరగనుందని, 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తామని సింధు తల్లిదండ్రులు ప్రకటించారు.
పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వెంకట దత్త సాయి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమ ఇరువురు కుటుంబాలకు ఎప్పటినుంచో పరిచయం ఉందని, వరుడు దత్తసాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారని తండ్రి రమణ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి సింధు వరుసగా టోర్నీలు ఆడనుందని ఆయన వెల్లడించారు.