Home /Author Guruvendhar Reddy
Maha Kumbh stampede twenty members died: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్దకు చేరుకుంటున్నారు. ఈ మేరకు బస్టాండ్స్, రైల్వేస్టేషన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అధికారులు సైతం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. కాగా, మహా కుంభమేళాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కసలాటలో 20మంది మృతి చెందినట్లు సమాచారం. దీనిపై అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల […]
ISRO Marks 100th Mission ISRO GSLV-F15 Successful Launch: ఇస్రో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించిన వందో ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 6.23 నిమిషాలకు ఇస్రో చరిత్రాత్మక వందో ప్రయోగం జీఎస్ఎల్వీ-ఎఫ్15రాకెట్ ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రమోగం విజయవంతం కావడంతో షార్ సైంటిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2,250 కేజీలు బరువు ఉన్న ఈ శాటిలైట్‌ను యూఆర్ శాటిలైట్ సెంటర్ […]
PM Narendra Modi to inaugurate India’s 38th National Games in Dehradun: క్రీడాకారుల కేరింతలు, క్రీడాభిమానుల హర్షధ్వానాలు, వేలాది ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య 38వ జాతీయ క్రీడలు ప్రారంభమయ్యాయి. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు, చూపు తిప్పుకోనివ్వని నృత్యకారుల ప్రదర్శనలు, మనసును మైమరిపించే సంగీతం సాగుతుండగా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్డేడియంలో భారత ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరై, జాతీయ క్రీడాపోటీలను అధికారికంగా ప్రారంభించారు. గాయకుల పాటలకు […]
India vs England 3rd T20 match England beats India by 26 runs: హ్యాట్రిక్ విజయానికి బ్రేక్ పడింది. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన భారత్.. మూడో టీ20 మ్యాచ్‌లో బోల్తా పడింది. రాజ్‌కోట్ వేదికగా నిరంజన్ షా మైదానంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. 172 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత్ 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు […]
Mauni Amavasya At Maha Kumbh: మహా కుంభమేళాకు భక్తులు కోట్లాదిగా తరలివస్తున్నారు. ఇప్పటికే 15 కోట్ల మంది మహాకుంభ్‌లో అమృత స్నానాలు చేయగా, బుధవారం మౌని అమావాస్య నాడు కనీసం 10 కోట్ల మంది నదీ ప్రాంతాల్లో పుణ్య స్నానాలకు వస్తారని అధికారులు అంచనావేస్తున్నారు. దీని కోసం యూపీ సర్కారు భారీగా ఏర్పాట్లు చేసింది. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను అమర్చారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌ను నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. అయితే వాహనదారులకు ప్రభుత్వం పలు […]
Horoscope Today in Telugu January 29: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. అలాగే ఈరోజు మౌనీ అమావాస్య. మాఘ కృష్ణ అమావాస్య రోజున.. మౌనీ అమావాస్య అంటారు. సాధకులకు ఇది అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున చేసే జప, తప, నదీ స్నాన కర్మలకు విశేష ఫలం సిద్ధిస్తుందనేది హిందువుల విశ్వాసం. మేషం […]
India’s Gongadi Trisha hits historic first-ever century in U19 Women’s T20 World Cup: అండర్ 19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో భాగంగా ఇవాళ భారత్, స్కాట్లాండ్ తలపడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఉమెన్స్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో తెలంగాణ యువతి గొంగడి త్రిష 53 బంతుల్లోనే సెంచరీ చేసింది. తెలుగు యువ […]
CM Revanth Reddy Inaugurates Experium Experium ECO Park in Chevella: హైదరాబాద్‌లోని శివారులో చేవెళ్ల సమీపంలో ఉన్న ప్రొద్దుటూరులో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పార్కులో 150 ఎకరాల్లో రూ.450 కోట్లతో గార్డెన్ ఏర్పాటు చేశారు. ఈ ఎకోపార్కులో 25వేల జాతుల మొక్కలు, చెట్లు ఉన్నాయన్నారు. అంతేకాకుండా 85 దేశాల నుంచి అరుదైన మొక్కలను దిగుమతి చేసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి […]
Strike Siren From Feb 9 in Telangana TGRTC Bus services bandh: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందు తమ డిమాండ్లను ఉంచింది. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రెండు పీఆర్సీల అమలు, సీసీఎస్, పీఎఫ్ నగదు రూ.2,700 కోట్ల చెల్లింపు వంటి డిమాండ్లను ఉంచింది. ఈ డిమాండ్లను నెరవేర్చని యెడల ఫిబ్రవరి 9వ తేదీన సమ్మె చేయనున్నట్లు […]
DGP tirumala rao on increasing Cyber Crime In AP: రాష్ట్రంలో రోజురోజుకు సైబర్ క్రైమ్ పెరిగిపోతోంది. అయితే ఇతర నేరాలు తగ్గుతుండగా.. సైబర్ క్రైమ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ మేరకు శ్రీకాకుళంలో జరగిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. సైబర్ క్రైమ్ దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ సైబర్ క్రైమ్ అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సైబర్ క్రైమ్‌ను నియంత్రణలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి […]