Home /Author Guruvendhar Reddy
TCS to set up IT facility in AP: విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ రానున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విశాఖలో భారీ పెట్టుబడుల ద్వారా దాదాపు 10వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో ఏపీని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తాము చేస్తున్న కృషిలో టీసీఎస్ ద్వారా ఈ పెట్టుబడి ఓ కీలక మైలు రాయి అని పేర్కొన్నారు. లులు, ఒబెరాయ్, బ్రూక్‌ఫీల్డ్, సుజలాన్ […]
Asaduddin Owaisi slams Congress for blaming EVMs: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాల తలకిందుకు కాషాయం పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకుంది. తొలుత గాలి హస్తం వైపు వీచిన ఆ తర్వాత బీజేపీ ముందంజలో నిలిచి కాంగ్రెస్ పై విజయం సాధించింది. దీంతో హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ఫలితాల్లో బీజేపీ 48 స్థానాల్లో, కాంగ్రెస్ 37 స్థానాల్లో విజయం సాధించాయి. అటూ […]
Andhra CM Naidu Meets Union Minister Nitin Gadkari: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 7న ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు.. కేంద్ర రోడ్డు, రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీని మంగళవారం కలుసుకున్నారు. అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీని వల్ల రవాణా వ్యవస్థ మెరుగు […]
Adnan Sami’s mother passes away: బాలీవుడ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ తల్లి బేగం నూరీన్ షమీ ఖాన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 77 సంవత్సారాలు. ఈ మేరకు అద్నాన్ సమీ సోషల్ మీడియా వేదికగా విషయాన్ని వెల్లడించారు. అయితే మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. కానీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భావోద్వేగంతో ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. చాలా […]
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. గ్వాలియర్‌లోని మాధవరావ్ సింధియా స్టేడియంలో ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్.. 19.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ బెంబేలెత్తింది. బంగ్లా బ్యాటర్లలో మెహిదీ హసన్ మిరాజ్(35) పరుగులతో రాణించగా.. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (27) పరుగులు చేశాడు. తౌహిద్ హృదయ్ (12), […]
abhimani movie glimpse released: సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పటికే దేవినేని సహా అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సురేష్ కొండేటి లీడ్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అభిమాని’. ఇందులో . హీరోయిన్గా అక్సాఖాన్ నటిస్తుండగా.. అజయ్ ఘోష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను […]
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్యోగులు కలిశారు. ఈ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ నీటిసరఫరా విభాగంలో కాంట్రాక్ట్‌గా పనిచేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు.
CM Revanth Reddy Distributes Appointment Letter: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన ఉద్యోగుల సభలో మాట్లాడారు. కొత్తగా 1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లుగా ఉద్యోగాల కోసం నిరీక్షించారన్నారు. అందుకే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి గెలిపించారన్నారు. ఉద్యోగుల కళ్లల్లో సంతోషం […]
Arvind Kejriwal challenges Pm Modi: ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్టీఏ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అందిస్తే.. తాను బీజేపీ కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉచిత విద్యుత్ అమలు […]
Israeli airstrikes on Gaza mosque kill 26, injure 93: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున సెంట్రల్ గాజాలోని ఓ మసీదులో దాడి చేసింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. 93 మందికి తీవ్ర గాయాలైనట్లు హమాస్ తెలిపింది. డెయిర్ అల్-బలాహ్ పట్టణంలో ఉన్న ఓ మసీదులో శరణార్థులు తల దాచుకున్నారు. ఈ మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో మరణించిన వారంతా పురుషులేనని వెల్లడించింది. అయితే […]