Kuwait Fire: కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 41 మంది మృతి
: కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదానికి 41 మంది మృతి చెందారు. సుమారు 30 మంది భారతీయ కార్మికులు గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదం స్థానిక కాలమాన ప్రకారం ఉదయం ఆరు గంటలకు జరిగిందని కువైట్ వైద్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.
Kuwait Fire: కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదానికి 41 మంది మృతి చెందారు. సుమారు 30 మంది భారతీయ కార్మికులు గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదం స్థానిక కాలమాన ప్రకారం ఉదయం ఆరు గంటలకు జరిగిందని కువైట్ వైద్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. మంటలకు గాయపడిన 43 మందిని ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురు మృతి చెందినట్లు వైద్య మంత్రిత్వశాఖ తెలిపిది. కాగా ప్రమాదం కువైట్‌లోని మన్‌గాఫ్ నగరంలో చోటు చేసుకుంది. కువైట్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం పట్ల కేంద్ర విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ షాక్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. సంఘటన స్థలానికి భారత రాయబారి వెళ్లారని జై శంకర్ చెప్పారు.
బాధితులకు సాయం..(Kuwait Fire)
ఇదిలా ఉండగా కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబరు విడుదల చేసింది. అగ్ని ప్రమాద బాధితులకు భారత రాయబార కార్యాలయం సహాయ సహకారాలందిస్తోంది. కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో సుమారు 30 మంది భారతీయ కార్మికులకు ఈ అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయని వారిని ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. బాధితులకు పూర్తి సహాయ సహకారాలందిస్తామని కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం హామీ ఇచ్చింది.
ఇక మంటలు అంటుకున్న భవనం విషయానికి వస్తే ఇక్కడే కార్మికులు బస చేసేందుకు వసతులు కల్పించాయి కంపెనీలు. మంటలు అంటుకోగానే డజన్ల కొద్ది కార్మికులను రక్షించారు. అయితే దురదృష్టవశాత్తు చాలా మంది మంటల నుంచే వెలువడే పొగకు ఊపిరాడక చనిపోయారని సీనియర్ పోలీసు కమాండర్ చెప్పారు. కార్మికులను ఒకే గదిలో పెద్ద మొత్తంలో కుక్కరాదని తాము యాజమాన్యాలకు సూచిస్తుంటామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. అయితే ఈ భవనంలో మంటలకు గల కారణం గురించి కానీ.. ఇక్కడ పనిచేసే కార్మికుల వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టనున్నారు.