The Family Man 3 Actor Died: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ నటుడు అనుమానాస్పద మృతి

The Family Man 3 Actor Rohit Basfore Found Dead at Waterfall: ఓటీటీలో విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్‌లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఒకటి. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడో సీజన్ విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ సీజన్‌లో నటించిన నటుడు రోహిత్ బస్పోర్ అనుమానస్పదంగా మృతి చెందారు. ఇటీవల స్నేహితులతో కలిసి టూర్‌కి వెళ్లిన అతడు అస్సాంలోని ఓ జలపాతం వద్ద శవమై కనిపించాడు. నటుడి ఒంటిపై గాయాలు ఉండటంతో అతడి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గుర్తు తెలియని వ్యక్తులు అతడిని హత్య చేసి ఉండోచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. షూటింగ్‌కి విరామం దొరకండంతో రోహిత్ కొన్ని రోజుల క్రితమే ముంబై ఉంచి గౌహతి వెళ్లాడు. స్నేహితులతో సరదాగా గడిపేందుకు ఆదివారం టూర్ వెళ్లారు. ఆ రోజు సాయంత్రం నుంచి తన ఫోన్ స్వీచ్చాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రోహిత్ కోసం పోలీసుల గాలించారు. అస్సాంలోని ఓ జలపాతం వద్ద రోహిత్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడి శరీరం, ముఖంపై గాయాలు ఉండటంతో ఇది హత్య అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
రోహిత్ తల్లిదండ్రులు కూడా దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు కావాల్సిన వారే ఈ హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఇటీవల పార్కింగ్ విషయంలో తమవారు రంజిత్ బాస్ఫోర్, అశోక్ బాస్ఫోర్, ధరమ్ బాస్ఫోర్ అనే ముగ్గురు తమ కుమారుడు రోహిత్ బాస్ఫోర్‌తో గొడవ పడ్డారని మ్రతుడి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఇంటి వద్దే ఉన్న రోహిత్‌ను ట్రిప్‌కు వెళ్దామని జిమ్ యజమాని అమర్‌దీప్ పిలవడం వెళ్లాడని, ఇదంత పక్కా ప్లాన్ ప్రకారం చేశారని పేర్కొన్నారు. రోహిత్ శరీరం, ముఖం, తలపై భాగాల్లో బలమైన గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టం రిపోర్టులో తేలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. రోహిత్ బాస్ఫోర్ నటించన ది ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది.