Last Updated:

Mumbai: భారీ లాభాలను నమోదు చేసుకున్న స్టాక్ మార్కెట్లు

శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లకు సమయం గడుస్తున్న కొద్దీ కొనుగోళ్ల అండ లభించింది. రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ లాంటి దిగ్గజ షేర్లు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్ల కళ స్పష్టంగా కనిపించింది.

Mumbai: భారీ లాభాలను నమోదు చేసుకున్న స్టాక్ మార్కెట్లు

Mumbai: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతం అయిన శుక్రవారం భారీ లాభాలతో క్లోజ్ అయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 61,985.36 దగ్గర లాభాలతో ప్రారంభమై.. ఇంట్రాడేలో 62,529.83 దగ్గర గరిష్ఠాన్ని అందుకుంది. చివరకు 629 పాయింట్ల లాభంతో స్థిరపడింది. నిఫ్టీ 18, 368.35 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,508.55 దగ్గర గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 178.20 పాయింట్లు లాభపడి 18,499.35 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 14 పైసలు పుంజుకొని 82.58 దగ్గర నిలిచింది.

ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్ల కళ( Mumbai)

శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లకు సమయం గడుస్తున్న కొద్దీ కొనుగోళ్ల అండ లభించింది. రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ లాంటి దిగ్గజ షేర్లు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్ల కళ స్పష్టంగా కనిపించింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ షేర్లు మాత్రమే నష్టాలు నమోదు చేసుకున్నాయి. రిలయన్స్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా స్టీల్‌, టైటన్‌, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోఎడ్జ్‌ నికర లాభాలు 48 శాతం పుంజుకున్నాయి. అదే సమయంలో ఆదాయం 22.1 శాతం పెరిగింది. దీంతో కంపెనీ షేరు 6.86 శాతం పెరిగి రూ.4,168 దగ్గర స్థిరపడింది.

మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను మహీంద్రా అండ్‌ మహీంద్రా శుక్రవారం ప్రకటించింది. కంపెనీ ఏకీకృత లాభం 15 శాతం పెరిగి రూ. 2,998 కోట్లకు చేరింది. అదే సమయంలో ఆదాయం 25.3 శాతం పుంజుకొని రూ. 26,215 కోట్లకు పెరిగింది. కంపెనీ షేరు విలువ ఈరోజు మార్పు లేకుండా రూ.1,277 దగ్గర నిలిచింది.

గత ఏడాది నాలుగో త్రైమాసికంలో సన్‌ ఫార్మా లాభం రూ. 1,984 కోట్లుగా నమోదైంది. ఆదాయం 15.7 శాతం పెరిగి రూ. 10,930 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీ షేరు విలువ ఈ రోజు 2.32 శాతం పెరిగి రూ. 966.95 తో స్థిరపడింది.

నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 50 వేల మార్క్ ను అధిగమించి రికార్డు స్థాయికి చేరుకుంది.