CSK vs GT: చివర్లో తడబడిన చెన్నై.. గుజరాత్ లక్ష్యం 173 పరుగులు
CSK vs GT: ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది.
CSK vs GT: చివర్లో చెన్నై తడబడింది. దీంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. మెుదట్లో రుతురాజ్ గైక్వాడ్ రాణించిన.. మిడిలార్డర్ విఫలమైంది. రుతురాజ్ 60 పరుగులు చేయగా.. కాన్వే 40 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్ లో ధోని ఒక్క పరుగుకే ఔటయ్యాడు.
గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ, మహమ్మద్ షమీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. నూర్ అహ్మద్, రషీద్ ఖాన్, దర్శన్ తలో వికెట్ పడగొట్టారు.
LIVE NEWS & UPDATES
-
CSK vs GT: చివర్లో తడబడిన చెన్నై.. గుజరాత్ లక్ష్యం 173 పరుగులు
చివర్లో చెన్నై తడబడింది. దీంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. మెుదట్లో రుతురాజ్ గైక్వాడ్ రాణించిన.. మిడిలార్డర్ విఫలమైంది. రుతురాజ్ 60 పరుగులు చేయగా.. కాన్వే 40 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్ లో ధోని ఒక్క పరుగుకే ఔటయ్యాడు.
గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ, మహమ్మద్ షమీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. నూర్ అహ్మద్, రషీద్ ఖాన్, దర్శన్ తలో వికెట్ పడగొట్టారు.
-
CSK vs GT: ధోని ఔట్.. నిశ్శబ్దంగా గ్రౌండ్
ధోని ఒక్క పరుగుకే ఔటయ్యాడు. మోహిత శర్మ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం మెుత్తం నిశ్శబ్దం ఆవరించింది.
-
CSK vs GT: ఐదో వికెట్ కోల్పోయిన చెన్నై.. రాయుడు ఔట్
చెన్నై ఐదో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్ లో రాయుడు క్యాచ్ ఔటయ్యాడు.
-
CSK vs GT: నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై.. కాన్వే ఔట్
చెన్నై నాలుగో వికెట్ కోల్పోయింది. కాన్వే క్యాచ్ ఔటయ్యాడు.
-
CSK vs GT: మూడో వికెట్ కోల్పోయిన చెన్నై.. రహానే ఔట్
జోరుమీదున్న రహానే ఔటయ్యాడు. దీంతో చెన్నై మూడో వికెట్ కోల్పోయింది. దర్శన్ బౌలింగ్ లో రహానే క్యాచ్ ఔటయ్యాడు.
-
CSK vs GT: 13 ఓవర్లకు 99 పరుగులు
13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై రెండు వికెట్లకు 99 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానే, కాన్వే ఉన్నారు.
-
CSK vs GT: రెండో వికెట్ డౌన్.. శివం దూబే క్లీన్ బౌల్డ్
చెన్నై రెండో వికెట్ కోల్పోయింది. నూర్ అహ్మద్ బౌలింగ్ లో దూబే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
-
CSK vs GT: తొలి వికెట్ కోల్పోయిన చెన్నై.. గైక్వాడ్ ఔట్
చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. మోహిత్ శర్మ బౌలింగ్ లో గైక్వాడ్ క్యాచ్ ఔటయ్యాడు. లాంగ్ ఆఫ్ లో మిల్లర్ ఈజీ క్యాచ్ అందుకున్నాడు.
-
CSK vs GT: గైక్వాడ్ అర్దసెంచరీ.. 10 ఓవర్లకు 85 పరుగులు
రుతురాజ్ గైక్వాడ్ అర్దసెంచరీతో చెలరేగాడు. దీంతో చెన్నై 10 ఓవర్లు ముగిసేసరికి 85 పరుగులు చేసింది.
-
CSK vs GT: గైక్వాడ్ అర్దసెంచరీ..
రుతురాజ్ గైక్వాడ్ అర్దసెంచరీతో చెలరేగాడు. 31 బంతుల్లో 51 పరుగులు చేశాడు.
-
CSK vs GT: ముగిసిన పవర్ ప్లే.. 49 పరుగులు చేసిన చెన్నై
పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై 49 పరుగులు చేసింది.
-
CSK vs GT: నాలుగు ఓవర్లకు 31 పరుగులు
నాలుగు ఓవర్లు ముగిసేసరికి చెన్నై 31 పరుగులు చేసింది. మూడో ఓవర్ చివరి బంతికి కాన్వై ఫోర్ కొట్టాడు.
-
CSK vs GT: రెండో ఓవర్లో 14 పరుగులు..
రెండో ఓవర్లో చెన్నై 14 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ వచ్చింది.
-
CSK vs GT: తొలి ఓవర్.. కేవలం నాలుగు పరుగులే
మహమ్మద్ షమీ వేసిన తొలి ఓవర్లో కేవలం నాలుగు పరుగులే వచ్చాయి. క్రీజులో కాన్వై, గైక్వాడ్ ఉన్నారు.
-
CSK vs GT: చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
-
CSK vs GT: గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ
-
CSK vs GT: టాస్ గెలిచిన గుజరాత్
టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది.