Prince Harry: ఛార్లెస్ పట్టాభిషేకం.. మేఘన్ మార్కెల్‌పై బకింగ్ హామ్ ప్యాలెస్ ఏమందంటే?
Prince Harry: ఛార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ పట్టాభిషేకానికి వచ్చే విషయంలో ఆసక్తి నెలకొంది.
Prince Harry: ఈ రోజు ప్రపంచం దృష్టి బ్రిటన్ వైపే ఉంది. ఆధునిక యుగంలో ఓ రాజు పట్టాభిషేకం జరుగుతోందక్కడ. బ్రిటన్ లో 70 ఏళ్ల తర్వాత ఈ పట్టాభిషేకం జరగనుంది. ఈ మహా ఘట్టానికి వెస్ట్‌మినిస్టర్ అబే వేదికైంది. అయితే రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ హ్యారీ సతీమణి మేఘన్ రాకపై.. బకింగ్ హామ్ ప్యాలెస్ క్రీలక ప్రకటన చేసింది.
ఆ ప్రకటన ఇదే..
రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ హ్యారీ.. తన తండ్రి ఛార్లెస్-3 పట్టాభిషేకానికి ఓ సాధారణ అతిథిగా వచ్చారు. ఈ వేడుకల్లో ఆయన ఎలాంటి రాజరిక పాత్రను పోషించట్లేదని సమాచారం. ఇక, హ్యారీ సతీమణి మేఘన్ రాకపై బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటన చేసింది.
ఛార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ పట్టాభిషేకానికి వచ్చే విషయంలో ఆసక్తి నెలకొంది. అయితే దీనిపై బకింగ్ హామ్ ప్యాలెస్ అధికారిక ప్రకటన చేసింది. హ్యారీ వస్తున్నారని, మార్కెల్ మాత్రం హాజరుకావడం లేదని తెలిపింది.
పట్టాభిషేకానికి ప్రిన్స్ హ్యారీ హాజరవుతారు. ప్రిన్స్ ఆర్కీ, ప్రిన్సెస్ లిలిబెట్‌తో కలిసి డచెస్ ఆఫ్ ససెక్స్ కాలిఫోర్నియాలోనే ఉండిపోతారు అని పేర్కొంది. ఆర్కీ, లిలిబెట్.. హ్యారీ, మేఘన్ సంతానం. రాజ సింహాసనాన్ని అధిష్ఠించే వారసుల జాబితాలో ఆర్కీ ఆరోస్థానంలో ఉన్నారు. ఈ పట్టాభిషేకం రోజునే ఆ చిన్నారికి నాలుగేళ్లు పూర్తవుతున్నాయి.
కొంతకాలంగా.. తండ్రి చార్లెస్, సోదరుడు విలియం హ్యారీతో సంబంధాలు చెడిపోయాయి. బ్రిటన్ రాజ కుటుంబ సభ్యుడిగా తాను ఎదుర్కొన్న అనుభవాల సమాహారంతో ప్రిన్స్ హ్యారీ‘స్పేర్’ పేరిట స్వీయ జీవిత చరిత్ర రాసిన సంగతి తెలిసిందే. అది తీవ్ర వివాదాస్పదమైంది. ఈ పరిణామాల మధ్యే మేఘన్ పట్టాభిషేకానికి రాకపోవడం గమనార్హం.