Court gives green signal to hike: రైతుల మహా పాదయాత్రకు ఎపి కోర్టు గ్రీన్ సిగ్నల్
అర్ధరాత్రి ఉత్తర్వులు ఇస్తూ అమరావతి రైతులు చేపట్టిన రెండవ విడుత మహా పాదయాత్ర అనుమతి లేదన్న డిజిపి ఆర్డర్స్ ను ఎపి హైకోర్టు కొట్టివేసింది. పరిమితి ఆంక్షలతో పాదయాత్ర చేపట్టవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Court gives green signal to hike: అర్ధరాత్రి ఉత్తర్వులు ఇస్తూ అమరావతి రైతులు చేపట్టిన రెండవ విడుత మహా పాదయాత్ర అనుమతి లేదన్న డిజిపి ఆర్డర్స్ ను ఎపి హైకోర్టు కొట్టివేసింది. పరిమితి ఆంక్షలతో పాదయాత్ర చేపట్టవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అమరావతి ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులకు చేరుకొంటున్న నేపధ్యంలో ఉద్యమ నిర్వాహకులు తిరుపతిరావు, శివరెడ్డిలు అమరావతి నుండి అరసవల్లికి చేపడుతున్న పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే నిన్నటిదినం (గురువారం) అర్ధరాత్రి ఏపి డిజివి శాంతి భధ్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయంటూ పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ అర్ధరాత్రి ఆదేశాలు జారీచేశారు.
శుక్రవారం కోర్టు పనులు ప్రారంభం అయిన వెంటనే రైతుల పిటిషన్ న్యాయమూర్తులు తొలి కేసుగా పరిగణలోకి తీసుకొన్నారు. వెంటనే ఆదేశాలు జారీచేస్తూ పోలీసులకు ఈ రోజే అనుమతి కోసం అర్జీ పెట్టుకోవాలని సూచించింది. పాదయాత్రలో 600మందికి మించకుండా చేపట్టాలని పేర్కొనింది. రైతుల దరాఖస్తును పరిశీలించి వెంటనే అనుమతులివ్వాలని కోర్టు పోలీసులను ప్రత్యేకంగా ఆదేశించింది. పాదయాత్ర వివరాలతోపాటుగా ముగింపు సభపై కూడా అనుమతి తీసుకోవాలని రైతులకు హైకోర్టు పేర్కొనింది.
న్యాయమూర్తుల ఆదేశాలతో అమరావతిని రాజధానిగా ఉండాలని కోరుకుంటున్న ఉద్యమ నేతల్లో సంతోషం తాండవించింది.