Ind vs Sl: రెండో వన్డేలో ఇండియా గెలుపు.. సిరీస్ కైవసం
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. దీంతో మరో మ్యాచ్ ఉండగానే భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 215 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు వెంటవెంటనే వెనుదిరిగారు.
Ind vs Sl: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. దీంతో మరో మ్యాచ్ ఉండగానే భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 215 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు వెంటవెంటనే వెనుదిరిగారు.
సిరీస్ కైవసం
215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. తడబడుతూ బ్యాటింగ్ చేసింది. మెుదటి మ్యాచ్ లో రాణించిన రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ఈ మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రోహిత్ శర్మ 17 పరుగులకే ఔట్ అవ్వగా.. జోరు మీదున్నా గిల్ 21 పరుగులకు ఔట్ అయ్యాడు. ఇక గత మ్యాచ్ లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో కేవలం నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యార్, కేఏల్ రాహుల్ సంయమనంగా ఆడటంతో భారత్ విజయం దిశగా అడుగులేసింది.
ప్రభావం చూపని లంక బౌలర్లు
రజిత బౌలింగ్ లో శ్రేయస్ ఎల్బీడబ్యూ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన పాండ్యాకు కేఏల్ రాహుల్ సహకారం అందిస్తు.. తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 36 పరుగులు చేసిన పాండ్యాను కుశాల్ మెండీస్ వెనక్కి పంపాడు. అక్షర్ పటేల్ సైతం 21 పరుగులతో రాణించాడు. చివర్లో కుల్ దీప్ సాయంతో కేఎల్ రాహుల్ విజయాన్ని పూర్తి చేశాడు. ఈ విజయంతో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ ను ఇండియా
కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 103 బంతుల్లో 64 పరుగులు సాధించి ఇండియాకు విజయాన్ని అందించాడు. శ్రీలంక బౌలింగ్ లో లహిరు కుమారా, కరుణరత్న తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
కానిస్టేబుల్ కొడుకు పార్టీకి.. సైకిల్ మెకానిక్ కొడుకు మద్దతు
ఫస్ట్ టైం.. ఉత్తరాంధ్ర కళాకారులతో కలసి స్టేజిపై డ్యాన్స్ చేసిన పవన్ కళ్యాణ్
Janasena Yuvashakthi: నేను కులనాయకుడిని కాదురా సన్నాసుల్లారా.. వైసీపీ నేతలపై జనసేనాని ఫైర్
Janasena Yuvashakthi: జనసేన పార్టీ పెట్టినప్పుడు నా అకౌంట్లో ఉన్నది రూ.13 లక్షలే.. పవన్ కళ్యాణ్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/