Texas Super Kings: డుప్లెసిస్ సెంచరీ.. టెక్సాస్ సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ

Texas Super Kings won the match against MI New York: మేజర్ లీగ్ క్రికెట్ 2025 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. ఇందులోభాగంగా ఎంఐ న్యూయార్క్, టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్లు తలపడగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ .. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. టెక్సాస్ బ్యాటర్లలో డుప్లెసిస్ 103 సెంచరీతో కదం తొక్కగా, డోనోవాన్ 53 కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎంఐ న్యూయార్క్ బౌలర్లలో జార్జ్, రుషిల్ తలో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో ఎంఐ న్యూయార్క్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 184 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఎంఐ న్యూయార్క్ బ్యాటర్లలో పొలార్డ్ మాత్రమే 70 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.. టెక్సాస్ బౌలర్లలో హొసైన్ 3 వికెట్లు పడగొట్టగా.. బర్గర్, స్టోయినిస్ చెరో 2 వికెట్లు తీశారు.