Last Updated:

Reliance Foundation: ఉన్నత విద్యను అభ్యసిసించే విద్యార్థులకు పదేళ్లలో 50,000 స్కాలర్‌షిప్‌లు.. రిలయన్స్ ఫౌండేషన్

దేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పదేళ్లలో 50,000 స్కాలర్‌షిప్‌లను అందజేస్తామని రిలయన్స్ ఫౌండేషన్ మంగళవారం ప్రకటించింది.

Reliance Foundation: ఉన్నత విద్యను అభ్యసిసించే విద్యార్థులకు పదేళ్లలో 50,000 స్కాలర్‌షిప్‌లు.. రిలయన్స్ ఫౌండేషన్

Reliance Foundation: దేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పదేళ్లలో 50,000 స్కాలర్‌షిప్‌లను అందజేస్తామని రిలయన్స్ ఫౌండేషన్ మంగళవారం ప్రకటించింది.రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు – చైర్మన్ ధీరూభాయ్ అంబానీ 90వ జయంతి సందర్భంగా ఈ ప్రకటన చేసింది. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ, రూ. 2 లక్షల వరకు 5,000 మెరిట్-కమ్-మీన్స్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు మరియు 100 వరకు మెరిట్ ఆధారిత పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు రూ. 6 లక్షల వరకు అందజేస్తామని ఫౌండేషన్ తెలిపింది. వీటికోసం ఫిబ్రవరి 14, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రూ. 15 లక్షల లోపు కుటుంబ ఆదాయం కలిగిన విద్యార్థులు తమ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్‌లో మొదటి సంవత్సరంలో చేరిన వారు తమకు నచ్చిన ఏదైనా సబ్జెక్ట్ స్ట్రీమ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బాలికలు మరియు ప్రత్యేక సామర్థ్యం గల విద్యార్థుల దరఖాస్తులను ప్రోత్సహించడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యం.రిలయన్స్ ఫౌండేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు రేపటి భవిష్యత్తు నాయకులను గుర్తించి మరియు పెంపొందించే లక్ష్యంతో దరఖాస్తు చేసుకోవడానికి అందరికీ అందుబాటులో ఉన్నాయి .ప్రముఖ నిపుణులతో ఇంటర్వ్యూలతో సహా కఠినమైన ఎంపిక ప్రక్రియను అనుసరించి ప్రదానం చేయబడుతుంది.

కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్, ఎలక్ట్రికల్ మరియు/లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, రెన్యూవబుల్ & న్యూ ఎనర్జీ, మెటీరియల్ సైన్స్ & ఇంజనీరింగ్ మరియు లైఫ్ సైన్సెస్ రంగాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

ఇవి కూడా చదవండి: