Health Benefits Of Amla: ఆమ్లా(ఉసిరి)తో ఆరోగ్య ప్రయోజనాలు మెండు
శీతాకాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల అత్యంత వేగంగా వ్యాధులు వస్తాయి. అయితే చలికాలంలో వచ్చే ఈ సమస్యల నుంచి సులభంగా ఈ ఒక్క సహజసిద్ధమైన ఉసిరితో చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
Health Benefits Of Amla: మానవుని జీవన శైలిలో కాలక్రమేనా మార్పులు సంభవిస్తున్నాయి. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువ మంది అనారోగ్యం బారిన పడుతుంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల అత్యంత వేగంగా వ్యాధులు వస్తాయి. అయితే చలికాలంలో వచ్చే ఈ సమస్యల నుంచి సులభంగా ఈ ఒక్క సహజసిద్ధమైన ఉసిరితో చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
ప్రతి రోజు ఒక ఉసిరికాయ తినడం వల్ల శరీరంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. సి విటమిన్ శరీరంలో తగిన మోతాదులో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలకు తక్కువగా గురవుతారు. ఉసిరి కాయ మాత్రమే కాకుండా ఆ చెట్టులోని వేరు నుంచి చివరి చిగురు వరకు ప్రతి భాగమూ ఔషధంగా అద్బుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఇకపోతే ఉసిరిలో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కాదు. అది చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. ఉసిరి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. ఉసిరి రసం చలికాలంలో క్రమం తప్పకుండా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఉసిరి రసం వల్ల కలిగే ప్రయోజనాలు:
- శరీరంపై వచ్చే డార్క్ స్పాట్స్‌ను సులభంగా నియంత్రిస్తుంది.
- శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుదలకు కాణమైన హిమోగ్లోబిన్ స్థాయిని ఉసిరి రసం పెంచుతుంది.
- ఉసిరి రసం కంటి చూపును పెంచడానికి సహాయపడుతుంది.
- శరీరంలో నీటి కోరతను తగ్గించి బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది.
- రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
- శరీరాన్ని అంటువ్యాధుల నుంచి సంరక్షిస్తుంది.
- చర్మ సౌందర్యాన్ని పెంచి చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
- మలబద్ధకాన్ని సులభంగా తగ్గిస్తుంది.
- కళ్ళు ఎర్రబడకుండా కంటిని సంరక్షిస్తుంది.
- నెలసరి సమస్యలను తగ్గించడంలోనూ కీలకంగా ఉపయోగపడుతుంది
మరి ఇంకెందుకు ఆలస్యం ప్రతిరోజు అత్యంత చౌకగా లభించే ఈ సీజనల్ ఫ్రూట్ ని ప్రతి రోజు తప్పకుండా తింటారు కదా.
ఇదీ చదవండి: హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గినప్పుడు వీటిని తీసుకోండి!