Gold And Silver Prices: బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధర మళ్లీ పెరిగి రికార్డు దిశగా దూసుకెళ్తుంది. గత మూడు రోజుల నుంచి వరుసగా బంగారం ధరలు పెరిగాయి. బంగారానికి దేశ వ్యాప్తంగా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పాటు అంతర్జాతీయ కొనుగోళ్లు ఊపందుకోవడంతో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆషాఢం మాసం పండుగల సమయంలో.. శ్రావణ మాసం పెళ్లిల కోసం గోల్డ్ కొనుక్కునే వారికి బంగారం షాకిస్తూ పరుగులు పెడుతోంది. గత నెల ఆఖరున వరుసగా వారం రోజులుగా తగ్గిన బంగారం రేటు ఇప్పుడు భారీగా పెరిగింది. జులై నెల మొదటి నుంచి గోల్డ్ ధర భారీగా పెరుగుతూ వస్తోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,050 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 90,810 గా ఉంది. అలాగే వెండి ధర రూ.1,09,900కు చేరింది. అలాగే ముంబై నగరంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98 వేల900 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90వేల 660 గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే కిలో రూ.1,09,900 కు చేరింది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.440 పెరిగి రూ.99,330 కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.400 పెరగడంతో రూ. 91,050 చేరింది. మరోవైపు కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.1,12,000 పలుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇవే ధరలున్నాయి.