Published On:

Bima Sakhi Yojana: ఈ స్కీమ్ తో ఇంట్లోనే మహిళలు డబ్బు సంపాదించే ఛాన్స్.. ఆ స్కీమ్ ఏంటంటే?

Bima Sakhi Yojana: ఈ స్కీమ్ తో ఇంట్లోనే మహిళలు డబ్బు సంపాదించే ఛాన్స్.. ఆ స్కీమ్ ఏంటంటే?

Bima Sakhi Yojana for Women: మీరు ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించే మార్గాలను కూడా అన్వేషిస్తుంటే.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రారంభించిన బీమా సఖి పథకం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకం ద్వారా మహిళలు తాము నివసిస్తున్న ప్రాంతం నుంచే పనిచేస్తూనే స్వయం సమృద్ధి సాధించడానికి LIC ఏజెంట్లుగా శిక్షణ పొందుతారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 1 లక్ష బీమా సఖిలను కూడా తయారు చేస్తారు.

 

బీమా సఖి యోజన అనేది కేంద్ర ప్రభుత్వం, జీవిత బీమా కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం. ఇది మహిళలు స్వంతంగా డబ్బు సంపాదించుకునే లక్ష్యంతో ప్రారంభించబడింది. ఈ పథకంలో మహిళలు తమ చుట్టుపక్కల ప్రాంతంలో బీమా సేవలను అందించగలిగేలా బీమా ఏజెంట్లుగా శిక్షణ పొందుతారు. శిక్షణ పూర్తయిన తర్వాత.. ఈ మహిళలు LIC ఏజెంట్లుగా పనిచేయడం ప్రారంభిస్తారు. ఇది వారికి ఆదాయ మార్గంగా మారుతుంది. అంతే కాకుండా ఆర్థికంగా సాధికారులను చేస్తుంది.

 

అర్హతలు:

వయస్సు 18 నుండి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులు. ఒక మహిళ ఇప్పటికే LICలో ఏజెంట్, ఉద్యోగి లేదా వారి దగ్గరి బంధువు అయితే, ఈ పథకానికి అర్హులుగా కాదు.

 

ఎలా అప్లై చేసుకోవాలి ..?

అధికారిక వెబ్‌సైట్ licindia.in కి లాగిన్ అయ్యి.. లేదా స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్/CSC పోర్టల్ ద్వారా ఫారమ్ నింపండి. ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, 10వ తరగతి మార్కుల షీట్, ఫోటో, బ్యాంక్ అకౌంట్‌కు వివరాలకు సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

 

శిక్షణ తర్వాత..?

శిక్షణ పూర్తయిన తర్వాత, మహిళలకు బీమా సఖి సర్టిఫికేట్, LIC ఏజెంట్ కోడ్ ఇస్తారు. దీని ద్వారా వారు బీమా పాలసీలను అమ్మడం ప్రారంభించవచ్చు. మూడు సంవత్సరాల శిక్షణా సమయంలో.. బీమా, ఆర్థిక అక్షరాస్యత, కస్టమర్ సేవ , అమ్మకాలను గురించి పూర్తి సమాచారం ఇస్తారు. ప్రత్యేక విషయం ఏమిటంటే.. బాగా పనిచేసే మహిళలు భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉంటారు.

 

ఆదాయం, స్టైపెండ్:

శిక్షణ సమయంలో మహిళలకు నెలకు ₹5,000 – ₹7,000 వరకు స్టైఫండ్ ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత.. వారు LIC ఏజెంట్లుగా మారతారు. అంతే కాకుండా కమీషన్, బెనిఫిట్స్ పొందడం ప్రారంభిస్తారు. ఒక మహిళ బాగా పనిచేస్తే.. మొదటి సంవత్సరంలోనే ₹48,000 వరకు సంపాదించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి: