Published On:

Schemes For Children: వీటిలో పెట్టుబడి పెడితే.. మీ పిల్లల భవిష్యత్తుకు డోకా ఉండదు!

Schemes For Children: వీటిలో పెట్టుబడి పెడితే.. మీ పిల్లల భవిష్యత్తుకు డోకా ఉండదు!

Schemes For Children: తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. ప్రస్తుతం చాలా మంది తమ పిల్లలు పెద్దయ్యే వరకు ఆగకుండా పుట్టిన వెంటనే వారి భవిష్యత్తు బాగుండాలని ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభిస్తున్నారు. విద్యతో పాటు ప్రతి రంగంలో ఖర్చులు పెరగడం వల్ల పిల్లల కోసం చిన్న వయసులోనే పెట్టుబడులు పెట్టడం అవసరం. ఇలా చేయడం వల్ల పిల్లలు 21 ఏళ్లు నిండే సమయానికి, పెట్టుబడులపై మంచి రాబడిని పొందవచ్చు. అంతే కాకుండా మీ జీవితాన్ని చింత లేకుండా గడపవచ్చు. మీరు మీ పిల్లలకు మంచి రాబడి వచ్చే పెట్టుబడుల కోసం కూడా చూస్తున్నట్లయితే.. ఈ పథకాలను గురించి తెలుసుకోవడం ముఖ్యం.

 

ఎల్ఐసి జీవన్ తరుణ్ ప్లాన్:
దీర్ఘకాలిక పెట్టుబడి విషయానికి వస్తే.. నేటికీ చాలా మంది LICని నమ్ముతారు.LIC యొక్క జీవన్ తరుణ్ పథకం పిల్లల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. మీ పిల్లల వయస్సు కనీసం 90 రోజుల నుండి 12 సంవత్సరాలు ఉంటే ఈ పథాకాన్ని ప్రారంభించవచ్చు. ఈ పాలసీ పిల్లలకు 25 సంవత్సరాలు నిండినప్పుడు పూర్తవుతుంది దీనిలో, మీరు 3 నెలలు, 6 నెలలు, సంవత్సరానికి ప్రీమియం చెల్లించవచ్చు. మీరు రూ. 54,000 వార్షిక ప్రీమియం చెల్లిస్తే, మీ పెట్టుబడి 8 సంవత్సరాలలో రూ. 4,32,000 అవుతుంది. దీనిపై.. మీకు రూ. 2,47,000 బోనస్ లభిస్తుంది.ఆ తర్వాత రూ. 97,000 లాయల్టీ బోనస్‌గా లభిస్తుంది. ఈ విధంగా.. ఈ పాలసీ కింద మీకు మొత్తం రూ. 8,44,550 లభిస్తుంది.

 

సుకన్య సమృద్ధి యోజన:
మీ కూతురి వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే.. మీరు వారి కోసం సుకన్య సమృద్ధి యోజలో అకౌంట్ తీసుకోవచ్చు. ఇందులో మీరు మీరు ప్రతి సంవత్సరం కనీసం రూ. 250 డిపాజిట్ చేయాలి. ఏడాదికి గరిష్టంగా రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన కింద మీకు 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.

 

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి:
మీరు ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టాలనుకుంటే.. మ్యూచువల్ ఫండ్లను కూడా ప్రయత్నించవచ్చు. మీరు 2 సంవత్సరాల వయస్సు నుండి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టి 12 నుండి 15 శాతం రాబడిని పొందినట్లయితే.. నెలకు దాదాపు రూ. 5100 పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. కానీ మీరు 8 సంవత్సరాల వయస్సు నుండి పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. నెలకు రూ. 11,271 పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. 12 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. నెలకు రూ. 20,805 పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. కాబట్టి.. పిల్లలు పుట్టిన తర్వాత వీలైనంత త్వరగా ప్రారంభించాలి.

ఇవి కూడా చదవండి: