Breakfast Everyday: ప్రతీరోజు బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా.? శరీరానికి కలిగే నష్టాలు ఇవే.. వాటిని నివారించండి ఇలా.!

Health Tips On Breakfast Everyday: ఉదయం లేచిన వెంటనే కాలీగా ఉన్న కడుపుకు ఆకలి వేస్తుంది. కడుపులో ఎలుకలు, పిల్లులు అనే తేడా లేకుండా అనేక జంతువులు పరిగెడుతాయి. దాన్ని సంతృప్తి పరచడానికి టిఫిల్ లేదా నాష్టా కావాల్సిందే. ఎవరి ఆహార రుచులను బట్టి ఇండ్లీ, వడ, ఓట్స్, దోస, పూరీ లాంటివి ప్రిఫర్ చేస్తారు. అయితే కొందరు మాత్రం టిఫిన్ చేయకుండా అశ్రద్దవహిస్తారు. దీని వలన ఆరోగ్యానికి అనేక రకాలైన నష్టాలు ఏర్పడతాయి.
టిఫిన్ అనేది శరీరానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది రాత్రంతా విశ్రాంతి తీసుకున్న శరీరాన్ని రీచార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కేవలం ఆకలిని మాత్రమే తీర్చడానికి ఉపయోగపడదు, శరీరంలోని మెటబాలిజంకు సపోర్ట్ చేస్తుంది. మెటబాలిజం అంటే ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ. దీంతోపాటుగా ఉదయం టిఫిన్ తినకపోతే కొందరికి తలనొప్పి, జీర్ణ సంబంధమైన సమస్యలు, గ్యాస్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్లనే బ్రేక్ ఫాస్ట్ ను తప్పక తినాలి.
ఏదిఏమైనప్పటికి చాలామంది ప్రజలు ఇప్పటికీ టిఫిన్ చేయాడాన్ని ఇష్టపడరు. ఇందుకు అనేక కారణాలను చెబుతుంటారు. అసలు టిఫిన్ ను ప్రతీరోజు దాటవేయడం వలన ఎలాంటి నష్టాలు ఏర్పడతాయో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే నష్టాలు ఏంటో తెలిస్తే ఆటోమెటిక్ గా తినడం మొదలుపెడతారు.
మెటబాలిజం క్షిణిస్తుంది..
మెటబాలిజం అంటే ఆహారాన్ని శరీరానికి కావలసిన శక్తిగా మార్చే ప్రక్రియ. ప్రతీ రోజు టిఫిన్ ను తినకుంటే మెటబాలిజం క్షిణిస్తుంది. శరీరానికి ప్రతీరోజు ఉదయం శక్తి పుంజుకోవాలంటే టిఫిన్ తప్పటిసరి.
అతిగా తినడం
ఉదయం టిఫిన్ ను తినని వాళ్లకు మధ్యాహ్నం అయ్యే సరికి ఆకలి విపరీతంగా అవుతుంది. దీని వలన మీరు లంచ్ లో ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. దీంతో హై షుగర్, హై ఫ్యాట్ ఫుడ్ మీ శరీరంలోకి చేరుతుంది. ఇది అరోగ్యానికి అంత మంచిది కాదు బరువు కూడా పెరిగే అవకాశం ఉంది.
శక్తి
బ్రేక్ ఫాస్ట్ చేయడం వలన శరీరంలో గ్లూకోస్ తయారవుతుంది. ఇది మొదడు పనితీరుతోపాటు ఫిజికల్ ఆక్టివిటీస్ కు కూడా బలాన్ని ఇస్తుంది. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వలన దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. అలసట, చురుకుగా ఉండకపోవడం, ఏదైనా పనిమీద దృష్టి నిలపలేకపోవడం జరుగుతుంది.
చిరాకుగా ఉంటుంది
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే చాలా చిరాకుగా ఉంటుంది. ఏ పనిమీదకూడా మూడ్ ఉండదు. షుగర్ లెవల్స్ తక్కువ అవుతాయి. దీంతో ఇన్సులిన్ ను చికాకు పెట్టవచ్చు. అనారోగ్యానికి కారణం కావచ్చు. కాబట్టి ప్రతీ రోజు ఉదయం తప్పకుండా టిఫిన్ చేయండి. టీ, కీఫీలకు దూరం ఉండండి.
గమనిక.. పైన తెలిపిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎవరినీ బయపెట్టేందుకుకాదు. టిఫిన్ విషయంలో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే డాక్టర్లను సంప్రదించగలరు. కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.