Published On:

Green Tea Health Tips: రెండు వారాలు ‘గ్రీన్ టీ’ని ఈ విధంగా తాగితే శరీరంలో ఊహించని మార్పులు

Green Tea Health Tips: రెండు వారాలు ‘గ్రీన్ టీ’ని ఈ విధంగా తాగితే శరీరంలో ఊహించని మార్పులు

గ్రీన్ టీతో ఇన్ని లాభాలా.!   తెలుసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి

Green Tea: గ్రీన్ టీ తో ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. డాక్టర్లు కూడా మామూలు టీ కాకుండా గ్రీన్ టీ తాగాలని సూచిస్తున్నారు. ఇది కామెల్లియా సినెన్సిస్ మొక్క ఆకుల నుంచి తయారవుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ టీ తాగడం వలన బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రెండు వారాలపాటు గ్రీన్ టీ తాగితే శరీరంలో ఉన్నతమైన మార్పులు కనిపిస్తాయి. గ్రీన్ టీ క్రమం తప్పకుండా తాగేవారికి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది, చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎక్కువ కాలం జీవించడంలో కూడా సహాయపడుతుంది.

 

గ్రీన్ టీ లో మైక్రోబయోటిక్  ఉంటుంది. 15రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి అవసరమైన బ్యాక్టీరియాలను పెంచుతుందని అధ్యయనంలో వెళ్లడైంది. రక్తంలో చక్కర స్థాయిలను వాపును తగ్గిస్తుంది. దీంతోపాటు కాలేయాన్ని రక్షించడంలో గ్రీన్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాలేయం చుట్టు కొవ్వు పెరగకుండా గ్రీన్ టీ జాగ్రత్తలు తీసుకుంటుంది. 2013లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం గ్రీన్ టీ అల్కహాల్ లేని ఫ్యాటీ లివర్ డిసీజ్ లను, కాలేయానికి వచ్చే వాపు, కొవ్వును అదుపులో ఉంచుతుంది. గ్రీన్ టీని క్రమం తప్పకుండా తాగేవారిలో గుండె సంబంధిత వ్యాధులు తక్కువ.

 

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వివిధ వ్యాధులనుంచి శరీరానికి రక్షిస్తుంది. చర్మాన్ని గ్రీన్ టీ ఆరోగ్యవంతంగా కాంతివంతంగా ఉంచుతుంది. ఇందులో ఉండే కాటెచిన్స్ అనే పదార్థాలు జీవక్రియను పెంచి బరువు తగ్గడానికి సహాయపడతాయి.

 

ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగకూడదు. ఎందుకంటే అసిడిటీని కలిగిస్తుంది. ఒక రోజులో రెండు లేదా మూడు సార్లు గ్రీన్ టీ తాగాలి. అంతకన్నా ఎక్కువ ప్రిఫర్ చేయకూడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భోజనం తర్వాత కనీసం గంట రెండు గంటల గ్యాప్ ఇచ్చి గ్రీన్ టీ తాగడం మంచిది. ఇందులో చెక్కెర, పాలు కలపకుండా తాగడం ఉత్తమం. గ్రీన్ టీని ఒకటవ శతాబ్దంలో చైనాలో వాడుకలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆతర్వాత ప్రపంచ వ్యాప్తంగా మన్నికలో ఉంది.

 

గమనిక.. పైన తెలిపిన విషయాలు కేవలం అవగాహనకోసం మాత్రమే. పైవాటిని పాటించేముందు డాక్టర్ సలహా తప్పనిసరి తీసుకోగలరు. కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.