Published On:

Short Circuit: వర్షాకాలంలో షార్ట్ సర్క్యూట్.. జరగకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలు ఇవే!

Short Circuit: వర్షాకాలంలో షార్ట్ సర్క్యూట్.. జరగకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలు ఇవే!

Short Circuit: ఒక వైపు.. వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. మరోవైపు.. కొన్ని సందర్భాల్లో చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ సీజన్‌లో గోడలు, వైరింగ్ వ్యవస్థలో నీరు లీక్ కావడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా.. షార్ట్ సర్క్యూట్ ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. ఇది మీకు ప్రాణాంతకం కావచ్చు. ఈ సీజన్‌లో.. గోడలు, స్విచ్ బోర్డులు తాకినప్పుడు కరెంట్ షాక్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇవే..

 

షార్ట్ సర్క్యూట్ :
మీ ఇంటి వైరింగ్ చాలా పాతది అయితే.. ఈ పరిస్థితిలో మీరు దానిని తప్పకుండా మార్చాలి. అంతే కాకుండా కొత్త వైరింగ్‌ను ఏర్పాటు చేయాలి. పాత వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్ ప్రమాదం చాలా పెరుగుతుంది.

 

చాలా మంది బాత్రూంలో స్విచ్‌బోర్డ్‌ను కింది భాగంలో అమర్చుకుంటారు. దీని కారణంగా.. అది తడిసిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎల్లప్పుడూ బాత్రూంలో స్విచ్‌బోర్డ్‌ను పైభాగంలో అమర్చాలి. ఇది విద్యుత్ షాక్ గురయ్యే అవకాశాలను తగ్గిస్తుంది.

 

ఇంట్లో ఎల్లప్పుడూ బ్రాండెడ్ , మంచి నాణ్యత గల వైర్లను మాత్రమే వాడండి. ఇంటి వైరింగ్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. వంటగదిలోని వాటర్ ఫిల్టర్, మైక్రోవేవ్, బాత్రూంలో గీజర్, బాల్కనీలో వాషింగ్ మెషిన్, ఓపెన్ సాకెట్లతో ప్లగ్ బోర్డులు వాడే ముందు జాగ్రత్తగా ఉండండి.

 

షార్ట్ సర్క్యూట్ జరిగితే.. మీరు వెంటనే మెయిన్ స్విచ్ నుండి కరెంట్ ఆపివేయాలి. ఈ సమయంలో తడి పరికరాలను అస్సలు తాకకూడదు. దీంతో పాటు, షార్ట్ సర్క్యూట్‌ను సరిచేయడానికి ఒక ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్‌ను పిలవండి. వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు, మీరు మీ ఇంట్లోని విద్యుత్ పరికరాలను చెక్ చేయించండి.

ఇవి కూడా చదవండి: