Last Updated:

Hemoglobin: హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గినప్పుడు వీటిని తీసుకోండి!

బీట్‌రూట్‌లో కాల్షియం, ఐరన్, విటమిన్ ఎతో పాటు విటమిన్ సి మనకి కావాలిసినంత పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌ను  జ్యూస్‌లా చేసుకుని తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్  స్థాయిలు  పెరుగుతాయి.కాబట్టి  ఇలా రసాన్ని  క్రమం  తప్పకుండా తీసుకుంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలకు  తగ్గుతాయి.  

Hemoglobin: హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గినప్పుడు వీటిని తీసుకోండి!

Hemoglobin: మనలో చాలా మందికి వివిధ రకాల కారణాల వల్ల రక్తంలోని  హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గుతుంటాయి. ఐతే హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. రక్తహీనత సమస్యల వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా తగ్గుతుంది. ఐతే పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువుగా వస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు  రక్తహీనత సమస్యల బారిన పడుతున్నారు. ఐతే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో  హీమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతుంది.

క్యారెట్:
రక్తహీనత ప్రస్తుతం ఒక సాధారణ సమస్యగా మారింది. హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు క్యారెట్స్‌ను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో శరీరానికి కావాల్సిన బీటా కెరోటిన్, ఫైబర్, విటమిన్ కె, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

బీట్‌రూట్:
బీట్‌రూట్‌లో కాల్షియం, ఐరన్, విటమిన్ ఎతో పాటు విటమిన్ సి మనకి కావాలిసినంత పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌ను జ్యూస్‌లా చేసుకుని తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి ఇలా రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలకు తగ్గుతాయి.

స్ట్రాబెర్రీ:
శరీరానికి స్ట్రాబెర్రీలు చాలా అవసరం. దీనిలో బాడీకి  కావాల్సిన విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే హిమోగ్లోబిన్ సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: