RTC Drivers: ట్రాఫిక్ నిబంధనలు పాటించండి: ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన
నగరంలో అడ్డగోలుగా నిలుపుతున్న ఆర్టీసీ వాహనాలను క్రమబద్ధీకరించే పనిలో పోలీసులు పడ్డారు. ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా మార్గాన్ని సుమగమం చేసే క్రమంలో పలు కీలక సూచనల నేపధ్యంలో కట్టడి మార్గాల్ని అన్వేషిస్తున్నారు
Hyderabad: నగరంలో అడ్డగోలుగా నిలుపుతున్న ఆర్టీసీ వాహనాలను క్రమబద్ధీకరించే పనిలో పోలీసులు పడ్డారు. ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా మార్గాన్ని సుమగమం చేసే క్రమంలో పలు కీలక సూచనల నేపధ్యంలో కట్టడి మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఇందుకోసం ఏ వాహనాల ద్వారా ట్రాఫిక్ కు నిత్యం అంతరాయం ఏర్పడుతుందో గుర్తించే పనిలో పడ్డారు.
ఈ క్రమంలో గోషామహల్ లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్ ట్యూట్ అధికారుల ఆధ్వర్యంలో రాణిగంజ్ బస్ డిపో డ్రైవర్లకు అవగాహన సదస్సు చేపట్టారు. డ్రైవర్లు విధిగా బస్ బేలలోనే బస్సులను నిలపాలని వారికి సూచించారు. కొన్ని మార్గాల్లోని ఫ్రీ లెఫ్ట్ ను బ్లాక్ చేయవద్దని వారికి విజ్నప్తి చేశారు. ట్రాఫిక్ నియమాలతో బస్సులను నడపాలని వారితో అన్నారు.
పలు చోట్ల ట్రాఫిక్ ను అంతరాయం కల్గిస్తున్న కొంతమంది డ్రైవర్ల బాధ్యతారాహిత్యాన్ని గుర్తు చేశారు. దీంతో పలు మార్గాల్లో ట్రాఫిక్ చిక్కుల్లో ప్రజలు చేరుకొంటున్నారని గుర్తించాలన్నారు. పద్దతి ప్రకారం వాహనాలు నడిపితే అన్ని వాహనాలు సకాలంలో గమ్యస్ధానాలను చేరుకుంటాయని తెలుసుకోవాలన్నారు. కూడళ్ల వద్ద స్టాపింగ్ కు అనుమతి ఉండదన్నారు. సూచించిన ప్రాంతాల్లోనే బస్సులను నిలపాలన్నారు.
మరోవైపు ప్రజలకు కూడా పోలీసుల శాఖ పలు అవగాహనలు కల్పిస్తుంది. మరీ ముఖ్యంగా రెడ్ సిగ్నల్ పడిన క్రమంలో తెలుపు గీత దాటవద్దని పదే పదే చెబుతున్నారు. అతిక్రమించిన వారికి జరిమానాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రద్దీ మార్గాల్లోని ఆక్రమణలను సైతం తొలగించేందుకు పోలీసు శాఖ సన్నద్ధమైంది.
ఇది కూడా చదవండి: ట్విన్ సిటీస్ లో భారీగా పెరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు