Published On:

Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన.. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్

Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన.. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్

Virat Kohli Announced Retirement to Test Career: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేశారు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. టీమిండియా తరఫున టెస్టులకు విరాట్ కోహ్లీ.. 14 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్ కెరీర్‌లో 123 మ్యాచ్‌లు ఆడగా.. 9,230 పరుగులు చేశాడు. కాగా, ఇప్పటికే టీ20లకు విరాట్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

 

కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కూడా రోహిత్ బాటలోనే టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేశాడు. ఈ మేరకు విరాట్ కోహ్లీ ఇన్‌స్టా వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశాడు.

 

14 ఏళ్లు టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా తరఫున ఆడటం గర్వకారణమన్నారు. నిరంతరం తన టెస్ట్ కెరీర్‌, ఆడిన టెస్ట్ మ్యాచ్‌లను చిరునవ్వుతో మళ్లీ చూస్తుంటానని తెలిపాడు. తెల్ల జెర్సీలో ఆడటం ప్రత్యేకమని చెప్పాడు. ఈ ఫార్మాట్ నుంచి వైదలగొడం అంత తేలిక విషయం కాదన్నాడు. ఈ టెస్ట్ కెరీర్ తనను ఎంతో పరీక్షించిదని, ఈ ఫార్మాట్ ఇంత దూరం తీసుకెళ్తుందని ఊహించలేదని చెప్పుకొచ్చాడు.

 

మొత్తం విరాట్ కోహ్లీ 123 టెస్ట్ మ్యా‌చ్‌లు ఆడగా.. 46.35 స్ట్రైక్ రేటుతో 9,230 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌ల్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేయడం విశేషం. ఇందులో 68 టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 40 మ్యాచ్‌ల్లో గెలిచాయి. స్వదేశంలో 55 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. 55.58 స్టైక్ రేటుతో 4,336 రన్స్ చేశాడు. విదేశాల్లో 66 మ్యాచ్‌లు ఆడగా.. 41.51 స్టైక్ రేటుతో 4,774 పరుగులు చేశాడు. ఇక టెస్టుల్లో కోహ్లీ అత్యధికంగా 254 పరుగులు.. 7 డబుల్ సెంచరీలు చేశాడు

 

ఇదిలా ఉండగా, టెస్ట్ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించి అత్యధికంగా విజయాలు నమోదు చేసిన జాబితాలో గ్రేమ్ స్మిత్(53), రికీ పాంటింగ్(48), స్టీవ్ వా(41) ఉన్నారు. విరాట్ కోహ్లీ తొలిసారిగా కెప్టెన్‌గా 2018-19లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలుచుకోగా.. చివరి మ్యాచ్‌ ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనే ఆడాడు. గత 10 టెస్ట్ మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ కేవలం 22.47 స్టైక్ రేటుతో 382 రన్స్ చేశాడు. ఇందులో భాగంగానే టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.