Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం

Uk Governament Honor Megastara Chiranjeevi: మెగాస్టార్ చిరంజీకి మరో అరుదైన గౌరవం దక్కింది. యూకే ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయం తెలిసి మెగా అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. చలన చిత్ర రంగానికి ఆయన అందించిన విశేష సేవలకుగానూ యూకే ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. సుమారు 40 ఏళ్లుగా ఆయన తెలుగు సినిమా రంగానికి విశేష సేవలు అందిస్తూ వస్తున్నారు. టాలీవుడ్‌కి ఎన్నో హిట్స్, బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించారు.
అంతేకాదు ఇతర భాషల్లోనూ ఆయన సినిమాలు విడుదల కావడం విశేషం. 40 ఏళ్లకు పైగా ఆయన సినీరంగానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తింపుగా యూకే ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. మార్చి 19న ఆయన యూకేలో ఈ అవార్డును అందుకోనున్నారు. దీంతో చిరంజీవికి సినీ రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే మెగా అభిమానులంత ఆయన ఫోటోలు షేర్ చేస్తూ ఆయన విషెస్ తెలుపుతున్నారు. తమ అభిమాన నటుడిగా ఇంతటి గౌరవం దక్కడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు.