Last Updated:

Hari Hara Veeramallu Postponed: ఆఫీషియల్‌ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌ వాయిదా – కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే!

Hari Hara Veeramallu Postponed: ఆఫీషియల్‌ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌ వాయిదా – కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే!

Hari Hara Veeramallu Again Postponed: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తోన్న హరిహర వీరమల్లు మూవీ రిలీజ్‌ వాయిదా పడనుందంటూ కొద్ది రోజులు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పుకార్లే నిజం అయ్యాయి. అవను.. ఈ సినిమా రిలీజ్‌ వాయిదా వేస్తున్నట్టు స్వయంగా మేకర్స్‌ ప్రకటించారు. అంతేకాదు కొత్త రిలీజ్‌ డేట్‌ని కూడా ఇప్పుడు చెప్పేశారు.

మళ్లీ వాయిదా

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ ఏపీ డిప్యూటీ సీఎం ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. అలాగే తాను సంతకం చేసిన సినిమాలను సైతం పూర్తి చేస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా షూటింగ్స్‌ సెట్స్‌లో వాలిపోతున్నారు. ఎన్నికలకు ముందు పవన్‌ కళ్యాణ్‌ మూడు సినిమాలకు సంతకం చేశారు. అందులో ఓజీ, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌తో పాటు హరిహర వీరమల్లు ఒకటి. అయితే ఏది ముందుగా రిలీజ్‌ అవుతుందనేది ముందు నుంచి క్లారిటీ లేదు. కానీ, హరిహర వీరమల్లు షూటింగ్‌ మాత్రమే చివరి దశకు చేరుకోవడంతో ఇదే ముందు వచ్చే అవకాశం కనిపించింది.

అనుకున్నట్టుగానే ఈ సినిమా మార్చి 28న థియేటర్లకు తీసుకువస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌, ఇటూ మెగా అభిమానుల సందడి మొదలైంది. మార్చి 28న ఇక రచ్చ రచ్చే అంటూ సోషల్‌ మీడియాలో తెగ జోష్‌ చూపించారు. కానీ, రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న మూవీ ప్రమోషన్స్‌ ఊసే లేదు. మూవీ టీం సైలెంట్‌గానే ఉంది. మూవీ హరిహర వీరమల్లు వాయిదా పనుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడు అదే నిజం చేస్తూ మేకర్స్‌ మూవీ రిలీజ్‌ని వాయిదా వేశారు. మార్చి నుంచి రెండు నెలల ముందుకు తీసుకువెళ్లారు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న డేట్‌నే ఫిక్స్‌ చేశారు.

మే 9న వీరమల్లు

మే 9న ‘హరి హర వీరమల్లు’ మూవీని రిలీజ్‌ చేస్తున్నట్టు తాజాగా మేకర్స్‌ వెల్లడించారు. ఈమేరకు మూవీ టీం కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఇక ఈ కొత్తగా రిలీజ్‌ చేసిన ఈ పోస్టర్‌ ఆసక్తిని కలిగిస్తోంది. ఇందులో పవన్‌ గుర్రంపై స్వారీ చేస్తూ ఉండగా.. ఆ వెనుక హీరోయిన్‌ నిధి అగర్వాల్‌తో పాటు మరో కీలక పాత్రలు సునీల్‌, నాజర్‌, కబీర్‌ సింగ్‌, సబ్బరాజులు కనిపించారు. మొదట డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు మూవీ షూటింగ్‌ జరిగింది. ఆ తర్వాత ఆయన తప్పుకోవడం నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఎ దయాకర్‌ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగితం అందిస్తున్నారు.