Last Updated:

POCO M7 5G: కొత్త మొబైల్ వస్తుంది.. రూ. 9,999లకే ఖతర్నాక్ ఫీచర్స్.. మార్చి 7న ఫస్ట్ సేల్..!

POCO M7 5G: కొత్త మొబైల్ వస్తుంది.. రూ. 9,999లకే ఖతర్నాక్ ఫీచర్స్.. మార్చి 7న ఫస్ట్ సేల్..!

POCO M7 5G: షియోమి సబ్ బ్రాండ్ పోకో భారతదేశంలో ‘POCO M7 5G’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ గత సంవత్సరం ప్రారంభించిన పోకో M6 స్మార్ట్‌ఫోన్‌ అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్, 5G నెట్‌వర్క్ సపోర్ట్, 2 సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఈ నేపథ్యంలో పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

POCO M7 5G Price
POCO M7 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ రూ. 9,999 ధరతో విడుదల చేసింది. ఈ ధర మొదటి సేల్‌కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ శాటిన్ బ్లాక్, మింట్ గ్రీన్, ఓషన్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో తీసుకొచ్చారు. ఈ ఫోన్ మొదటి సేల్ మార్చి 7 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతుంది.

POCO M7 5G Features And Specifications
POCO M7 5G స్మార్ట్‌ఫోన్ 6.88-అంగుళాల HD + డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz , రిజల్యూషన్ 1,640 X 720 పిక్సెల్‌లు, బ్రైట్‌నెస్ 600నిట్స్ , TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేట్‌తో ఉంటుంది. ఈ ఫోన్ Adreno GPUతో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 6GB + 128GB, 8GB + 128GB స్టోరేజ్ ఆప్షన్‌లతో వస్తుంది. ఈ ఫోన్‌లో microSD కార్డ్‌కి సపోర్ట్ ఉంది. ఈ ఫోన్‌లో 8GB వరకు వర్చువల్ RAM సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

ఈ పోకో ఫోన్ ఆండ్రాయిగ్ 14 ఆధారంగా HyperOS కస్టమ్ స్కిన్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌కు 2 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయని పోకో తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లో 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంది. దీనితో ఫోన్‌లో 2MP సెకండరీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

ఈ Poco ఫోన్‌లో 5,160mAh బ్యాటరీ అందించారు. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. అయితే, మీరు ఫోన్ బాక్స్‌లో 33W అడాప్టర్‌ని చూస్తారు. కనెక్టివిటీ కోసం ఇందులో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.