Last Updated:

Nurses Deliver Stillborn With Doctor On Video Call: వీడియో కాల్ ద్వారా ప్రసవం… తలకు బదులుగా కాళ్లు తీశారు..!

బాధ్యతగా మెలగాల్సిన వైద్యుడి బాధ్యతారాహిత్యం వల్ల నిండు ప్రాణం బలైంది. ఓ డాక్టర్‌ చేసిన నిర్లక్ష్యం వల్ల ఆ మహిళకు గర్భశోకం మిగిల్చింది. ప్రసవ వేదనతో ఆస్పత్రిలో చేరిన మహిళను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. పుట్టెడు శోకాన్ని మిగిల్చారు. వైద్యుడి వీడియో కాల్‌ సూచనల మేరకు నర్సులు ఆమెకు డెలివరీ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పుట్టు సునంబేడు గవర్నమెంట్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

Nurses Deliver Stillborn With Doctor On Video Call: వీడియో కాల్ ద్వారా ప్రసవం… తలకు బదులుగా కాళ్లు తీశారు..!

Nurses Deliver Stillborn With Doctor On Video Call: బాధ్యతగా మెలగాల్సిన వైద్యుడి బాధ్యతారాహిత్యం వల్ల నిండు ప్రాణం బలైంది. ఓ డాక్టర్‌ చేసిన నిర్లక్ష్యం వల్ల ఆ మహిళకు గర్భశోకం మిగిల్చింది. ప్రసవ వేదనతో ఆస్పత్రిలో చేరిన మహిళను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. పుట్టెడు శోకాన్ని మిగిల్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సమయానికి అందుబాటులో ఉండాల్సిన డ్యూటీ డాక్టర్‌ లేకపోవడంతో.. నర్సులే గర్భిణీకి డెలివరీ చేశారు. ఆపరేషన్‌ మధ్యలో ఆటంకం ఏర్పడడం వల్ల వైద్యుడి వీడియో కాల్‌ సూచనల మేరకు ఆమెకు డెలివరీ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పుట్టు సునంబేడు గవర్నమెంట్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే… సెప్టెంబర్ 19 సోమవారం రోజు పుష్ప(33) అనే మహిళ పురిటి నొప్పులతో తన భర్త మురళితో కలిసి సునంబేడు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది.
కానీ, ఆ సమయంలో అక్కడ నర్సులు తప్ప డాక్టర్‌ లేడు. అంతకుముందు పుష్ప పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వచ్చినప్పుడు పలు సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమెకు ప్రసవం సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్‌ ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే ఇవేవీ తెలుసుకోకుండా డాక్టర్ లేని సమయంలో నర్సులు గర్భిణీకి నార్మల్ డెలివరీ చేసేందుకు ప్రయత్నించారు. అప్పుడే వారికి సమస్య ఎదురైంది. ప్రసవం చేస్తుండగా శిశువు తలకు బదులుగా కాళ్లు బయటకు రావడాన్ని నర్సులు గమనించారు. దానితో వారికి ఏం చెయ్యాలో పాలుపోక.. గర్భంలో శిశువు అడ్డం తిరిగినట్లు గుర్తించి వెంటనే డాక్టర్‌కి కాల్‌ చేశారు. కాగా అప్పడు డాక్టర్‌ వీడియో కాల్‌ ద్వారా పలు సూచనలు చేశారు. అయినా నర్సులు శిశువు తలను బయటకు తీయలేకపోయారు.

దానితో పుష్పను మదురంతగమ్‌ జీహెచ్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. కాగా ఆమెను అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా శిశువు తల బయటకు వచ్చింది. ఆసుపత్రికి వెళ్లేలోపే శిశువు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. దానితో పెద్దఎత్తున స్థానికులు ఆస్పత్రి వద్దకు చేరుకుని నిరసనకు చేపట్టారు.  వైద్యుడు, నర్సులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: Private Ambulance mafia: గూడూరులో రెచ్చిపోయిన ప్రైవేటు అంబులెన్స్ మాఫియా

ఇవి కూడా చదవండి: