Published On:

Kumki Elephants: కుప్పంకు చేరుకున్న కుంకి ఏనుగులు

Kumki Elephants: కుప్పంకు చేరుకున్న కుంకి ఏనుగులు

Kumki Elephants: చిత్తూరు జిల్లా కుప్పంలోని ననియాల ఎలిఫెంట్‌ క్యాంపునకు మరో 2 కుంకీ ఏనుగులు చేరుకున్నాయి. కర్ణాటక నుంచి వినాయక, జయంత్‌ అనే పేర్లు గల ఏనుగులను కుప్పంలోని ఎలిఫెంట్‌ క్యాంపు అటవీ అధికారులకు అప్పగించారు. మొత్తంగా 6 కుంకీలను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరాగా.. పది రోజుల క్రితం 4 కుంకీ ఏనుగులు పలమనేరులోని ముసలిమడుగు ఎలిఫెంట్‌ ప్రాజెక్టు వద్దకు వచ్చాయి. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. అడవి ఏనుగుల నుంచి పంటను కాపాడటానికి ఈ కుంకీ ఏనుగులను ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ కుంకీల ఏనుగుల పర్యవేక్షణ కోసం మావటులకు నియమించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి: