Published On:

Maoist Conspiracy: మావోయిస్టుల కుట్ర భగ్నం

Maoist Conspiracy: మావోయిస్టుల కుట్ర భగ్నం

Maoist Conspiracy:  ఛత్తీష్‌ఘడ్‌ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసాయి. భద్రతాబలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ బాంబులు అమర్చగా.. వాటిని భద్రతా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశారు. కోహిమేటా పోలీస్ స్టేషన్ పరిధిలో కోడ్ఫర్-గుర్మా అటవీ ప్రాంత రహదారిలో మావోయిస్టులు బాంబులు అమర్చారు. అయితే మావోలు అమర్చిన 10 ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు గుర్తించి, నిర్వీర్యం చేశారు. కోడ్ఫర్-గుర్మా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో మావోయిస్టులు బాంబులు అమర్చారు.

 

 

ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే జరిగిన ఎన్ కౌంటర్లలో మావోయిస్టు ముఖ్యనేతలు చాలా మట్టుకు హతమయ్యారు. అంతకు రెండింతలు మావోయిస్టులు లొంగిపోయారు. హిడ్మా వంటి లీడర్లు పోలీసులకు చిక్కారంటేనే అర్థం అవుతుంది. ఇప్పటివరకు మావోలకు ఎప్పుడూ తగలని దెబ్బ ఈ ఆపరేషన్ కగార్ వలన తగిలింది.

 

 

తాజాగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల సమగ్ర సమాచారాన్ని మీడియాకు అందించింది. గతంలో కంటే మావోయిస్టుల సంఖ్యాబలం 90శాతం తగ్గిపోయిందని తెలిపింది. 2010లో మవోల హింసాత్మక సంఘటనలు 1936 ఉంటే 2024నాటికి 374కు తగ్గిపోయాయని ప్రకటించింది. దాదాపు 81శాతం హింస తగ్గిందన్నారు. 2013నాటికి మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 126ఉంటే, 2021నాటికి 70కి పడిపోయాయి. మావోయిస్టుల హింస 2010నాటికి 720మంది పౌరులు మరణిస్తే, 2019నాటికి 150కి చేరగా, 2024నాటికి 19మంది మరణించారని కేంద్రం తెలిపింది.

 

 

ఇవి కూడా చదవండి: