Lucknow Super Giants: లక్నోకు కొత్త కెప్టెన్.. ఐపీఎల్‌లో బెస్ట్ కెప్టెన్ అతడే?
Rishabh Pant named captain of Lucknow Super Giants: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా టీమిండియా యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ నియామకమయ్యారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో లక్నో మేనేజ్‌మెంట్ పంత్‌ను రూ.27కోట్లకు భారీ మొత్తంలో రికార్డు ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అందరూ ఊహించన విధంగానే పంత్‌కే కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.
లక్నోకు తొలి టైటిల్ ఇచ్చేందుకు 200 శాతం కృషి చేస్తానని చెప్పాడు. కొత్త ఉత్సాహంతో లక్నో తరఫున ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. న్యూ టీం, న్యూ ఫ్రాంఛైజీ అయినా కెప్టెన్‌గా నా వ్యవహార శైలిలో ఎలాంటి మార్పులు ఉండవని వెల్లడించారు. కెప్టెన్‌గా సహచరులతో ఎలా ఉండాలనే విషయాలను రోహిత్‌తో నేర్చుకున్నట్లు చెప్పారు. ప్రధానంగా ఆటగాళ్లపై నమ్మకం ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయని వెల్లడించారు.
ఈ మేరకు లక్నో సూపర్ జెయింట్స్ నయా కెప్టెన్ రిషభ్ పంత్‌పై ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ చరిత్రలోనే రిషభ్ బెస్ట్ కెప్టెన్‌గా నిలుస్తాడని ఆకాంక్షించాడు. అప్‌కమింగ్ ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా పంత్ వ్యవహరిస్తాడని కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో సంజీవ్ అధికారికంగా ప్రకటించాడు. పంత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అయితే గత సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్న పంత్.. మెగా వేలానికి ముందు ఆ జట్టును వీడగా, గత మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇదిలా ఉండగా, ఐపీఎల్‌లో ఒక టీంకు కెప్టెన్‌గా వ్యవహరించడం రిషబ్ పంత్‌కు ఇది రెండో సారి కావడం విశేషం. అంతకుముందు 2016 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు ఆడిన ఈ యంగ్ క్రికెటర్.. 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. మొత్తం 110 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 35.31 రేటింగ్‌తో 3,284 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఆ తర్వాత ఏడాది పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో రెండు సంవ్సతరాలు ఆటకు దూరంగా ఉంటూ బెడ్ రెస్ట్ తీసుకున్నారు. ఇక, మళ్లీ 2024లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సమయంలో ఢిల్లీకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.