Last Updated:

IND vs BAN: టీమిండియాకు పంత్ దూరం.. బీసీసీఐ ప్రకటన

టీమిండియా బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సిరీస్ కు మరో భారత క్రికెటర్ దూరమయ్యాడు. గాయం కారణంగా మహ్మద్ షమీ జట్టు నుంచి దూరం కాగా తాజాగా రిషబ్ పంత్ కూడా తప్పుకున్నాడు.

IND vs BAN: టీమిండియాకు పంత్ దూరం.. బీసీసీఐ ప్రకటన

IND vs BAN: టీమిండియా బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సిరీస్ కు మరో భారత క్రికెటర్ దూరమయ్యాడు. గాయం కారణంగా మహ్మద్ షమీ జట్టు నుంచి దూరం కాగా తాజాగా రిషబ్ పంత్ కూడా తప్పుకున్నాడు. బీసీసీఐ వైద్య బృందం సలహా మేరకు పంత్ ను వన్డే సిరీస్ నుంచి తప్పించినట్టు బోర్డు ఆదివారం తొలి వన్డేకు ముందు ప్రకటించింది. అతను టెస్టు సిరీస్ కోసం తిరిగి జట్టులో కలుస్తాడని తెలిపింది. పంత్ స్థానంలో మరే ప్లేయర్ ను జట్టులోకి తీసుకోలేదని వెల్లడించింది. ఇదిలా ఉంటే అసలు పంత్ కు ఏమైందో మాత్రం చెప్పలేదు.

అలాగే, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తొలి వన్డేకు అందుబాటులో ఉండటం లేదని తెలిపింది. కాగా, తొలి వన్డేలో భారత్ టాస్ ఓడిపోయింది. టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు యువ పేసర్ కుల్దీప్ సేస్ ను అరంగేట్రం అవకాశం కల్పించింది. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధవన్ ను తీసుకుంది. కీపర్ గా కేఎల్ రాహుల్ కు బాధ్యతలు అప్పగించింది.

భారత్ తుది జట్టు: 1. రోహిత్ శర్మ (కెప్టెన్), 2. శిఖర్ ధవన్, 3. విరాట్ కోహ్లీ, 4. శ్రేయస్ అయ్యర్, 5. కేఎల్ రాహుల్ (కీపర్), 6. వాషింగ్టన్ సుందర్, 7. షాబాజ్ అహ్మద్, 8. శార్దూల్ ఠాకూర్, 9. దీపక్ చహర్, 10. మహ్మద్ సిరాజ్, 11. కుల్దీప్ సేన్

బంగ్లాదేశ్ తుది జట్టు: 1. లిట్టన్ దాస్ (కెప్టెన్), 2. అనముల్ హక్, 3. నజ్ముల్ హొస్సేన్ శాంటో, 4. షకీబ్ అల్ హసన్, 5. ముష్ఫికర్ రహీమ్ (కీపర్), 6. మహ్మదుల్లా, 7. అఫీఫ్ హొస్సేన్, 8 .మెహిదీ హసన్ మిరాజ్, 9. హసన్ మహ్మద్, 10. ముస్తాఫిజుర్ రహ్మన్, 11. ఎబాడట్ హుస్సేన్.

ఇదీ చదవండి: కామెంటరీ చెబుతూ అస్వస్దతకు గురైన రికీ పాంటింగ్

ఇవి కూడా చదవండి: