Jr NTR: జపనీస్ భాషలో ఆకట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. వీడియో వైరల్
జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళీ కాంబినేషన్ తెరకెక్కి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్రం ఆర్ఆర్ఆర్. తాజాగా, ఈ చిత్రం శుక్రవారం (అక్టోబరు 21) జపాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్లో ఎన్టీఆర్ జపనీస్ భాషలో ప్రసంగించి అందరి అబ్బురపరిచారు.

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళీ కాంబినేషన్ తెరకెక్కి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను ఎలా తిరగరాసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా, ఈ చిత్రం శుక్రవారం (అక్టోబరు 21) జపాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా తమ సినిమాను ప్రమోట్ చేసేందుకు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతోపాటు చిత్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి సైతం జపాన్ వెల్లి సందడి చేశారు. అక్కడ కూడా మనవాళ్లకు క్రేజ్ ఏ మాత్రం తక్కువ కాదండోయ్. జూనియర్ ఎన్టీఆర్ కు అయితే ఫ్యాన్స్ గ్రీటింగ్ కార్డ్, లెటర్స్ ద్వారా తమ అభిమానాన్ని చూపారు. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్లో ఎన్టీఆర్ జపనీస్ భాషలో ప్రసంగించి అందరి అబ్బురపరిచారు. జపాన్ దేశ అభిమానులను ఆకట్టుకున్నారు.
‘అందరికీ నమస్కారం, మీరందరూ ఎలా ఉన్నారు. మిమ్మిల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమాను చూసి ఎంజాయ్ చేయండి’ అంటూ జపనీస్‌లో ఎన్టీఆర్ మాట్లాడారు. అనంతరం ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ‘‘మిమ్మల్ని చూడగానే జపాన్ భాషలో మాట్లాడాలని అనిపించింది. ఏమైనా తప్పులుంటే మన్నించండి. నేను జపాన్ లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఎన్నో చెప్పాలనిపిస్తోంది’’ అంటూ ఆయన అన్నారు.
ఎన్టీఆర్ గతంలో నటించిన అనేక చిత్రాలు జపాన్ లో విడుదలై ప్రజాదరణ పొందాయి. దానితో ఆయనకు జపాన్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో మరోసారి జపాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ వరల్డ్ వైడ్‌గా ఇప్పటికే రూ.1200 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించింది.
NTR @tarak9999 addressing the crowd in fluent Japanese while promoting #RRRinJapan pic.twitter.com/9rYrH64pmx
— Vamsi Kaka (@vamsikaka) October 21, 2022
ఇదీ చదవండి దీపావళి క్రాకర్‌లా “ధమాకా” టీజర్.. ఫుల్ ఎనర్జీతో రవితేజ..!