Dhamaka: దీపావళి క్రాకర్‌లా “ధమాకా” టీజర్.. ఫుల్ ఎనర్జీతో రవితేజ..!
త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందించబడుతున్న ధమాకా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విదలైన పోస్టర్‌లు, పాటలు మాస్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్ర బృందం ధమాకా క్రాకర్ అంటూ టీజర్‌ను రిలీజ్ చేసింది.
Dhamaka: మాస్ మహరాజా రవితేజ హీరోగా ఇటీవల తెరకెక్కిన ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దానితో ప్రస్తుతం రవితేజ ఒక భారీ హిట్టు కోసం వెయిట్ చూస్తున్నాడు. చాలా కాలం తర్వాత ‘క్రాక్’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ఈ హీరో. అదే జోష్‌ను తన నెక్ట్స్ సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది రిలీజైన తన వరుస చిత్రాలు ఫ్లాప్ అవడంతో ఒకింత నిరాశపడ్డాడు. కాగా ప్రస్తుతం మాస్ రాజ ఆశలన్ని ‘ధమాకా’ పైనే ఉన్నాయి.
త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందించబడుతున్న ధమాకా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విదలైన పోస్టర్‌లు, పాటలు మాస్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్ర బృందం ధమాకా క్రాకర్ అంటూ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఇకపోతే టీజర్‌లో మాస్‌రాజ చెప్పే డైలాగ్స్, యాక్షన్ స్టంట్స్ ఫుల్ ఎనర్జీతో వేరే లెవల్లో మాస్ రాజ ఈస్ బ్యాక్ అనేలా ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఫుల్ ఎనర్జిటిక్ పాత్రలో రవితేజ నటించినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ మూవీలో రవితేజ సరసన ‘పెళ్ళి సందD’ ఫేం శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో రవితేజ ఒకటి క్లాస్, మరొకటి మాస్ రెండు గెటప్‌లో కనిపించనున్నాడు.
ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియలో అందించిన నేపథ్య సంగీతం అయితే గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందు సందడి చేయనున్నట్టు టీజర్‌లో ప్రకటించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇదీ చదవండి “ప్రిన్స్” ట్విట్టర్ రివ్యూ.. థియేటర్లలో నవ్వుల వర్షం..!