Last Updated:

Ram Gopal Varma: హైదారాబాద్ లో తాలిబన్ రూల్.. రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసారు. అదీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన తనయుడు తారక రామారావు (కేటీఆర్)ను సంభోదిస్తూ వాళ్ళ పాలనను తాలిబన్ పాలనతో పోలుస్తూ వర్మ వరుస ట్వీట్లు చేసారు.

Ram Gopal Varma: హైదారాబాద్ లో తాలిబన్ రూల్.. రామ్ గోపాల్ వర్మ

Hyderabad: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసారు. అదీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన తనయుడు తారక రామారావు (కేటీఆర్)ను సంభోదిస్తూ వాళ్ళ పాలనను తాలిబన్ పాలనతో పోలుస్తూ వర్మ వరుస ట్వీట్లు చేసారు.

‘కేసీఆర్ గారూ, కేటీఆర్ గారూ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గారూ రాత్రి పది గంటల తర్వాత పబ్ లో మ్యూజిక్ ప్లే చేయకూడదనే రూల్ తీసుకురావడంతో పబ్ శ్మశాన వాటికను తలపించింది. అప్పుడు నా ఫీలింగ్ ఏంటో తెలుసా? తాలిబన్ల తరహాలో హైదరాబాద్ నగరాన్ని పాలిస్తున్నారని నాకు తెలియలేదు” అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. రోజంతా కష్టపడిన తర్వాత యువత కాస్త సరదాగా గడపడానికి వీలు లేకుండా పది గంటల తర్వాత ‘నో మ్యూజిక్’ పాలసీ తీసుకు రావడం తాలిబన్ల తరహాలో ఉందని వర్మ వ్యాఖ్యానించారు. సౌండ్ పొల్యూషన్ విషయం తనకు అర్థం అవుతుందని, అయితే అన్ని ఏరియాల్లో పది గంటల తర్వాత మ్యూజిక్ ప్లే చేయకూడదని నిబంధనలు తీసుకు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

కొన్ని యాక్సిడెంట్లు జరిగాయని ట్రాఫిక్ బ్యాన్ చేస్తామా? కొన్ని ఘటనలు జరిగాయని రాత్రి పది గంటల తర్వాత మ్యూజిక్ ప్లే చేయకపోవడం కూడా అంతేనని వర్మ అభిప్రాయపడ్డారు. ప‌బ్‌ల దగ్గరకు వెళ్లే పోలీసులు అక్కడ ఉన్న యువత, పబ్ యాజమాన్యాలను క్రిమినల్స్ తరహాలో చూస్తున్నారని వర్మ పేర్కొన్నారు. రాత్రి పది గంటల తర్వాత సౌండ్ రావడం ప్రాబ్లమ్ అయితే, థియేటర్లలో సౌండ్ లేకుండా సినిమా ప్రదర్శిస్తారా? హైదరాబాద్‌లో రాత్రి 10 గంటల తర్వాత వాహనాలు రాకుండా అడ్డుకోవాలా, రాత్రి 10 గంటల తర్వాత అన్ని విమానాల రాకపోకలను నిషేధించాలా ?అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు.

మనమంతా ఇండియాలో ఉంటున్నప్పుడు హైదరాబాదీలకు మాత్రమే ఈ తాలిబన్ రూల్ ఎందుకు? అని కేసీఆర్, కేటీఆర్‌ల‌ను వర్మ ప్రశ్నించారు. దేశంలో రాత్రి ఒంటి గంట తర్వాత ‘నో మ్యూజిక్’ పాలసీ ఉంటే, హైదరాబాద్ సిటీలో మాత్రమే పది తర్వాత ‘నో మ్యూజిక్’ పాలసీ ఏంటి? అని అడిగారు. పబ్ లో పది గంటల తర్వాత మ్యూజిక్ ఆపేయడంతో ఫారినర్స్ రియాక్షన్ తాను ఇంకా మరిచిపోలేనన పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్ మరో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని రామ్ గోపాల్ వర్మ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల నుండి పెట్టుబడిదారులు ఎక్కడికైనా రావాలంటే ప్రధానంగా అడుగేవి ఇవే. 1.అంతర్జాతీయ విమానాశ్రయం ఉందా? 2 . గోల్ఫ్ కోర్స్ ఉందా? 3. వినోద కేంద్రం ఉందా? 4. నైట్ లైఫ్ ఉందా? రాత్రి 10 గంటల తర్వాత వారికి సంగీతం వినిపించడం లేదని ఊహించండి అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు చేసారు.

 

ఇవి కూడా చదవండి: