Director Rajamouli : హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ తో రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ.. ఆర్ఆర్ఆర్ గురించి ఏమన్నారంటే?
దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ఈ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకోవడమే కాకుండా ఆస్కార్ బరిలో కూడా నిలిచి సత్తా చాటింది.
Director Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ఈ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకోవడమే కాకుండా ఆస్కార్ బరిలో కూడా నిలిచి సత్తా చాటింది.
కాగా ఈ తరుణంలోనే గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకల్లో భాగంగా జక్కన్న.. స్టీవెన్ స్పీల్‌బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్స్ ని కూడా కలిసి ఆర్ఆర్ఆర్ ఘన విజయం సాధించడం పట్ల వారి నుంచి అభినందనలు కూడా పొందారు.
ఇక స్పీల్‌బర్గ్ గురించి అప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నేను దేవుడిని కలిశాను అని రాసుకొచ్చారు.
అయితే ఇప్పుడు తాజాగా ఏకంగా ఆయన మూవీ కోసం ప్రమోషన్ లో భాగం అయ్యారు రాజమౌళి.
హాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీసిన ఘనత స్టీవెన్ స్పీల్‌బర్గ్ సొంతం.
అయితే గతేడాది ది ఫేబుల్‌మ్యాన్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు ఈ దర్శకుడు.
ఈ సినిమా పలు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ లో కూడా నిలిచింది.
ఈ చిత్రం తాజాగా ఇండియాలో రిలీజ్ అయింది. ఫిబ్రవరి 10న ఇండియాలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాగా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని భారత్ లో విడుదల చేసింది. ఇందులో భాగంగానే ది ఫేబుల్‌మ్యాన్స్ సినిమా ప్రమోషన్స్ కోసం డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ – రాజమౌళి వీడియో కాల్ ద్వారా మాట్లాడుకొని సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను చర్చించుకున్నారు. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ లో ఉంది.
ఆర్ఆర్ఆర్ చూస్తున్నంత ఆ విషయాన్ని నమ్మలేకపోయాను – స్టీవెన్
ఈ ఇంటర్వ్యూలో స్టీవెన్ స్పీల్‌బర్గ్ రాజమౌళిని.. ఆర్ఆర్ఆర్ సినిమాని మరోసారి అభినందించారు. మీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా నన్నెంతగానో ఆకట్టుకుంది. దాన్ని చూస్తున్నంత సేపూ నా కళ్లను నేను నమ్మలేకపోయా. అందులోని ప్రతి పాత్ర ప్రత్యేకంగా నిలిచింది. విజువల్స్, టేకింగ్ అత్యద్భుతం అని అన్నారు. దీనికి రాజమౌళి నాకైతే డ్యాన్స్ చేయాలని ఉంది సర్ అంటూ చెప్పడం విశేషం. ఇక రాజమౌళి ఈ సినిమా గురించి స్టీవెన్ స్పీల్‌బర్గ్ ని పలు ప్రశ్నలు అడిగాడు .
అందుకు గాను ఆయన సమాధానంగా.. ఇప్పటి వరకు ఇతరుల కథను చెప్పా. నా గురించి ఏం చెప్పాలి’ అన్న ఆలోచనలో భాగంగా ‘ది ఫేబుల్‌మ్యాన్స్’ వచ్చింది. నా పేరెంట్స్, సిస్టర్స్ గురించీ, నేను ఎదిగే క్రమంలో ఎదుర్కొనవన్నీ నిజాయతీగా చెప్పాలనిపించింది. మా అమ్మది చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం. ఆవిడ గురించి ఎక్కువగా ప్రస్తావించా. నా లైఫ్‌లో ఎంతో డ్రామా ఉంది. నా చిన్నప్పుడు మా కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే. బాల్యంలో నాకు ఓ కెమెరా ఉండేది. దానితోనే సినిమా తీయాలని కలలు కంటుండేవాణ్ని. నేను పడిన ఇబ్బందినే సినిమాలో సాముయేల్ పాత్ర పోషించింది. అని వెల్లడించారు. రాజమౌళి కూడా ది ఫేబుల్‌మ్యాన్స్ సినిమా చూశానని, తనకి చాలా బాగా నచ్చింది అని తెలిపాడు. అయితే ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Watch Steven Spielberg & S S Rajamouli talk about #TheFabelmans released in cinemas today.
Link: https://t.co/f0G7F6uSyH#StevenSpielberg @ssrajamouli @amblin @thefabelmans pic.twitter.com/jOEY5kg0Re
— Reliance Entertainment (@RelianceEnt) February 10, 2023
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/