Last Updated:

SSMB29: మహేష్‌-రాజమౌళి మూవీ షూటింగ్ వీడియో లీక్ , చర్యలకు దిగిన జక్కన్న టీం!

SSMB29: మహేష్‌-రాజమౌళి మూవీ షూటింగ్ వీడియో లీక్ , చర్యలకు దిగిన జక్కన్న టీం!

SSMB29 Movie Shooting Visual Leaked: ఎస్‌ఎస్‌ఎంబీ29(#SSMB29) మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. భారీ బడ్జెట్‌తో పాన్‌ వరల్డ్‌గా రూపొందుతుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ విషయంలో జక్కన్న సీక్రెట్‌ మెయింటెయిన్‌ చేస్తున్నాడు. మూవీకి సంబంధించి ఎలాంటి ప్రకటన, అప్‌డేట్‌ లేకుండా షూటింగ్‌ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో SSMB29కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ అయిన సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. అవి ఆడియన్స్‌లో ఫుల్‌ క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

ఈ క్రమంలో SSMB29 షూటింగ్‌ సెట్‌ నుంచి ఓ వీడియో లీక్‌ అవ్వగా అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో షేర్స్‌, లైక్స్‌ చేయడంతో నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఒరిస్సాలోని అడవుల్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో మహేష్‌ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్‌ పాల్గొన్నారు. అక్కడ మహేష్‌-పృథ్వీరాజ్ సుకుమారన్‌ల మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు ఈ లీక్డ్‌ వీడియోతో అర్థమైపోతుంది.

అయితే రాజమౌళి దర్శకత్వం విషయంలో ఎంత పర్ఫెక్షన్‌గా ఉంటారో, తన సినిమా షూటింగ్, లీక్డ్‌ విషయంలో అంతే జాగ్రత్తగా ఉంటారు. తన మూవీ అప్‌డేట్స్‌ బయటకు రాకుండ పగడ్బందీగా ఉంటారు. ఆయన మూవీ టీం అండ్‌ క్రూకి కార్పోరేట్‌ స్టైల్లో ఐడీ కార్డులు జారీ చేస్తారు. సెట్‌లోకి అడుగుపెట్టారంట ఎవరి చేతిలోనూ సెల్‌ఫోన్లు ఉండకూడదు. అంతేకాదు ఎన్నో విషయాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేసుకునే జక్కన మూవీ కూడా ఈ లీక్డ్‌ తప్పలేదు. తన మూవీకి సంబంధించిన లీక్‌లు రావడం ఇదే ఫస్ట్‌ టైం. దీంతో జక్కన్న అండ్‌ టీం వెంటనే అప్రమత్తమై చర్యలకు దిగింది.

ఈ సినిమాకు సంబంధించిన లీకైన వీడియోలను తొలగించే పనిలో పడింది. ఇప్పటికే పలు ప్లాట్‌ఫాంల నుంచి ఈ వీడియోలను తొలగించారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా షేర్‌ చేయకుంట చట్టపరమైన చర్యలు కూడా తీసుకోనన్నట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి పోరపాట్లు జరగకుండ భద్రత చర్యలను కట్టుదిట్టం చేయబోతోందట. కాగా ఒరిస్సా ఈ షెడ్యూల్‌ ఈ నెల 28 వరకు కొనసాగనుందట. అక్కడ తోలోమాలి, దేవ్‌మాలి, మాచ్‌ఖండ ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్‌ జరగనుందట. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్‌లో ప్రియాంక చోప్రా కూడా అడుగుపెట్టనుందని తెలుస్తోంది.