Last Updated:

Odisha DCM Tweet On SSMB29: ఒరిస్సాలో మహేష్‌,రాజమౌళి మూవీపై షూటింగ్‌ – స్పందించిన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఏమన్నారంటే!

Odisha DCM Tweet On SSMB29: ఒరిస్సాలో మహేష్‌,రాజమౌళి మూవీపై షూటింగ్‌ – స్పందించిన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఏమన్నారంటే!

Odisha Deputy CM Pravati Parida Tweet on SSMB29 Movie: గత కొంతకాలంగా మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. ఇటీవల మూవీ షూటింగ్‌ వీడియో లీక్‌ అవ్వడంతో SSMB29 ట్రెండింగ్‌లో నిలిచింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా ఓడిశా డిప్యూటీ సీఎం ట్వీట్‌ చేయడం విశేషం. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది.

అప్పుడు పుష్ప 2, ఇప్పుడు SSMB29

ప్రస్తుతం ఒరిస్సాలో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఒడిశా టూరిజం ప్రాముఖ్యతను వివరిస్తూ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రవతి పరిడ ట్వీట్‌ చేశారు. “గతంలో మల్కన్‌గిరలో పుష్ప 2 షూటింగ్‌ జరిగింది. ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్‌ రాజమౌళి రాజమౌళి, దక్షిణాది సూపర్‌ స్టార్స్‌ మహేష్‌ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి ప్రియాంక చోప్రాల రాబోయే చిత్రం ఎస్‌ఎస్‌ఎంబీ(SSMB29) షూటింగ్ జరుగుతోంది. దీనిబట్టి చూస్తే ఒడిశా సినిమా షూటింగ్‌ కోసం సినిమాటిక్‌ ల్యాండ్‌ స్కేప్ సంపద ఉందని రుజువు చేస్తోంది.

అన్ని ఇండస్ట్రీలను స్వాగతిస్తున్నాం..

ఇది ఒడిశా పర్యాటక రంగానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. త్వరనే ఇది సినిమా షూటింగ్‌లకు ప్రధానంగా మారుతుంది. ఇందుకోసం మేము ఒడిశాలో షూటింగ్‌ జరుపుకునేందుకు అన్ని చలనచిత్ర రంగాలను స్వాగతిస్తున్నాం. ఇందుకోస మేము పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ప్రవతి పరిడ గతేడాది బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఆమె.. ఒడిశా రాష్ట్రానికి తొలి మహిళా డిప్యూటీ సీఎంగా ఘనత సాధించారు.

కాగా రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోంది. భారీ బడ్జెట్‌తో పాన్‌ వరల్డ్‌ చిత్రం జక్కన్న ఎస్‌ఎస్‌ఎంబీ29ను ప్లాన్‌ చేశారు. ఇందులో గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నట్టు సమాచారం. దుర్గ ఆర్ట్స్‌ బ్యానర్‌లో కేఎల్‌ నారాయణ ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించారు. యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు జక్కన్న మైథలాజికల్‌ టచ్‌ ఇస్తున్నాడట. రామయాణం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సోషల్‌ మీడియా చర్చ నడుస్తోంది.