Karan Johar: రాజమౌళి సినిమాల్లో లాజిక్ ఉండదు – కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్

Karan Johar About SS Rajamouli Movies: గొప్ప సినిమాలకు లాజిక్‌తో పనిలేదంటున్నాడు బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్. దర్శకుడికి కథపై నమ్మకం ఉంటే చాలు అది బ్లాక్‌బస్టర్ అవుతుందన్నాడు. ఇటీవల కరణ్ జోహార్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. దర్శకుడిగా ఎన్నో సినిమాలు తెరకెక్కించిన ఆయన ఇతర దర్శకుల చిత్రాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్‌కు తన కథపై నమ్మకం ఉండటం చాలా ముఖ్యమన్నారు. వారు లాజిక్‌ని పట్టించుకోకుండా కథను నమ్మడం వల్లే పెద్ద విజయాలు అందుకుంటున్నారన్నారు.
సినిమా నచ్చితే లాజిక్‌ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు రాజమౌళి సినిమాలే చూడండి. ఆయన చిత్రాల్లో లాజిక్ ఉండదు. ఆయన సినిమాల్లో లాజిక్ గురించి జనాలు మాట్లాడుకుంటారా? లేదు కదా. ఆయనకు కథపై పూర్తి నమ్మకంతో పాటు పట్టుకు కూడా ఉంటుంది. ఎలాంటి సన్నివేశాన్ని అయినా ప్రేక్షకులకు నమ్మకం కలిగేలా తెరకెక్కిస్తారు. ఆయన కథను అంతగా నమ్ముతారు కాబట్టే ఆయన సినిమాల్లో లాజిక్ మిస్ అయినా పెద్ద విజయం సాధిస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్, యానిమల్, గదర్ లాంటి సినిమాలకు ఇదే ఫార్ములా వర్తిస్తుంది. ఈ సినిమాల హిట్‌కు ఆయా దర్శకులపై ఉన్న నమ్మకం కూడా ఒక కారణం. ఒక వ్యక్తి సింగిల్ హ్యాండ్‌తో వెయ్యి మందిని కొట్టడం సాధ్యమేనా? కాదా? అని ఎవరూ ఆలోచించరు. సన్నీ డియోల్ ఏదైనా చేయగలరని దర్శకుడు అనిల్ శర్మ నమ్మారు. దాన్నే తెరపై చూపించారు. దాన్ని ప్రేక్షకులు కూడా నమ్మారు. అందుకే గదర్ 2 బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. సినిమా విజయం పూర్తిగా విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. లాజిక్ల గురించి ఆలోచిండం వల్ల ఉపయోగం ఉండదు. అలా ఆలోచించిన, ఆడియన్స్ ఏమనుకుంటారోనని లాజిక్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టినా సమస్యలు తప్పవు” అని చెప్పుకొచ్చారు.