Last Updated:

Cow Hug day: ‘కౌ హగ్‌ డే’ పిలుపు ఉపసంహరణ.. కారణం ఇదే!

Cow Hug day: యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 14 న 'కౌ హగ్ డే'గా జరుపుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ బోర్డు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. గోవులను హగ్ చేసుకోవాలి అంటూ పిలుపునివ్వడం దేశంలో చర్చనీయాంశంగా మారింది.

Cow Hug day: ‘కౌ హగ్‌ డే’ పిలుపు ఉపసంహరణ.. కారణం ఇదే!

Cow Hug day: యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 14 న ‘కౌ హగ్ డే’గా (Cow Hug day) జరుపుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ బోర్డు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. గోవులను హగ్ చేసుకోవాలి అంటూ పిలుపునివ్వడం దేశంలో చర్చనీయాంశంగా మారింది.

విరమించుకోవడానికి కారణం ఇదేనా..

దేశంలో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో గోమాత ప్రాధాన్యతను తెలియజేసేందుకే గోవులను ఆలింగనం.. చేసుకోవాలని జంతు సంరక్షణ బోర్డు ఇటీవల పేర్కొంది. గోవులు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పేర్కొన్న గోవులను హగ్ చేసుకోవడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందని వివరించింది. ఇదే అంశంపై మాట్లాడిన కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి పురుషోత్తమ్‌ రూపాలా.. ఈ విషంయపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తే మంచిదే అన్నారు. కానీ అనూహ్యంగా.. ఈ పిలుపును ఉపసంహరించుకోవడం గమనార్హం.

గోవులను కౌగిలించుకోవడం పై విపక్షాల విమర్శలు

గోవులను కౌగిలించుకోవాలని.. బోర్డు ఇచ్చిన పిలుపుపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఈ పిలుపు హాస్యాస్పదమని శివసేన పేర్కొంది. దేశంలోని ప్రధాన సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఇలాంటి పిలుపులు ఇస్తున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. విపక్షాల నుంచి విమర్శలు అధికం కావడంతో.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిసింది.

 

యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 14 కౌ హగ్ డే’గా  జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది.

తాజా ఉతర్వుల్లో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన.

గోవు ప్రత్యేకతను తెలియజేసిన యానిమల్ వెల్ఫేర్ బోర్డ్.

పశు సంపద జీవవైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రకటన.

దీనిని “కామధేను” “గోమాత” అని పిలుస్తారుని జంతు సంక్షేమ బోర్డు ఒక ప్రకటన.

ప్రేమికుల దినోత్సవాన్ని నివారించేందుకు ఈ ప్రకటన చేశారని విపక్షాల ఆందోళన.

ఆవు ప్రపంచానికి తల్లి ప్రపంచంలోని ఏకైక జంతువు, మూత్రం మరియు పేడ కూడా ఔషధంగా పనిచేస్తాయి.

ఆవు స్పర్శతో అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చు. అందుకే ప్రజలు ఆవు కౌగిలింత జరుపుకోవాలని సూచించినట్లు తెలిపిన బోర్డు.

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేకి బదులు కౌ హగ్ డే జరుపోవాలని సూచన.

పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నిర్ణయం వెనక్కి.

దీనిపై వివరణ తెలియాజేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసిన జంతు సంక్షేమ బోర్డు.

దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నుండి వెల్లువెత్తిన నిరసనలు.

ప్రజా సమస్యలను మరల్చడానికే ఇలాంటి నిర్ణయం అని విపక్షాల ఆందోళన.