Vivo V50: పవర్ ఫుల్ కెమెరా, బ్యాటరీ.. వివో మొదటి ఫోన్.. రేపటి నుంచే సేల్..!

Vivo V50: టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న’Vivo V50′ మొబైల్ విడుదలైంది. కంపెనీ తన ‘V’ సిరీస్‌లో దీనిని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ ఏడాది విడుదలైన తొలి వివో ఫోన్ ఇదే. ఇది ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఈ మొబైల్ రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 25 నుంచి సేల్‌కి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లుక్, ఫీచర్స్ ఇప్పటికే మొబైల్ ప్రియులను ఆకర్షించాయి.ఈ ఫోన్ ధర, ఆఫర్స్, టాప్ 5 ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Vivo V50 Price And Offers
వివో వి50 ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.36,999, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 40,999 ధరతో విడుదల చేశారు. ఫోన్ రోజ్ రెడ్, స్టార్రీ బ్లూ, టైటానియం గ్రే కలర్ ఆప్షన్లలో విక్రయిస్తున్నారు. మొదటి సేల్ కోసం కంపెనీ కొన్ని ఆఫర్లను అందిస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి, ఎస్బిఐ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ మొబైల్ కొనుగోలు చేసే కస్టమర్లకు 10శాతం తగ్గింపు లభిస్తుంది. దీని మొదటి సేల్ రేపు (ఫిబ్రవరి 25) మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది.
Vivo V50 Features
వివో వి50 మొబైల్లో 6.77-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలేడ్ డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లే 2392 × 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లేలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీని కూడా ఉంది. స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిని 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్‌పై తయారుచేశారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15తో పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB ర్యామ్, 12జీబీ ర్యామ్ ఉన్నాయి. 256జీబీ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉంది.
వివో వి50 కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఫోన్లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఆరా లైట్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ మొబైల్లో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. మొబైల్ 6000ఎమ్ఏహెచ్ కెపాసిటీ బ్యాటరీతో విడుదలైంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. ఫోన్‌ను డస్ట్, వాటర్ నుంచి ప్రొటక్ట్ చేయడానికి IP68 + IP69 రేట్ చేశారు. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ 4జీ వోల్ట్, 5జీ, వైఫై, జీపీఎస్, బ్లూటూత్, యూఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి.