iPhone 15 Price Drop Alert: భారీగా పడిపోయింది.. ఐఫోన్ 15పై రూ.41 వేల డిస్కౌంట్.. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారా..?

iPhone 15 Price Drop Alert: ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ఐఫోన్‌లు మొదటి స్థానంలో ఉన్నాయి. ఐఫోన్‌లు చాలా కాస్ట్‌లీ. చాలా మంది వాటిని కొనడానికి పండుగ సీజన్ సేల్ కోసం చూస్తుంటారు. తద్వారా వాటిని డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు. అయితే ఇప్పుడు సేల్ లేకుండా మీరు “iPhone 15” 256GB వేరియంట్‌ను అతి తక్కువ ధరకు ఇంటికి తీసుకురావచ్చు. ఈ వేరియంట్ ధర మరోసారి భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ తన మిలియన్ల మంది వినియోగదారుల కోసం ప్రీమియం ఐఫోన్‌లపై గొప్ప ఆఫర్‌లను తీసుకొచ్చింది. ఇప్పుడు కొంటే వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఐఫోన్ 15 ఈ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం.
iPhone 15 Discounts
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 256జీబీ వేరియంట్ ధర రూ.79,900. అయితే, ఇప్పుడు మీరు దీన్ని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై వినియోగదారులకు 6శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. ఫ్లాట్ తగ్గింపుతో మీరు దీన్ని కేవలం రూ.74,400కి కొనుగోలు చేయచ్చు. దీనిపై ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్ కూడా ఇస్తోంది. మీరు Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో 5శాతం ఆదా చేసుకోగలరు. మీరు నాన్-ఈఎంఐతో వెళితే, మీరు మరో రూ. 2000 ఆదా చేయగలుగుతారు.
ఫ్లిప్‌కార్ట్ iPhone 15 256GBవేరియంట్‌పై బలమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుంటే, మీరు ఈ ప్రీమియం ఫోన్‌ను ఊహించిన దాని కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయగలుగుతారు. ఫ్లిప్‌కార్ట్‌లో మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను రూ.41,150 వరకు ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు. మీరు పూర్తి ఎక్స్‌ఛేంజ్ వాల్యూ పొందినట్లయితే ఈ ఫోన్‌ను కేవలం రూ. 33,250కి ఆర్డర్ చేయచ్చు. బ్యాంకు ఆఫర్లతో దాదాపు రూ.30 వేలకు కొనుగోలు చేసి మీ సొంతం చేసుకోవచ్చు.
iPhone 15 Specifications
టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 15ని 2023 సంవత్సరంలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో అల్యూమినియం ఫ్రేమ్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది. HDR10కి సపోర్ట్ చేసే 6.1 అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లే ఉంది.ఈ స్మార్ట్‌ఫోన్ iOS 17లో రన్ అవుతుంది. పెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో Apple A16 బయోనిక్ చిప్‌సెట్‌ను అందించింది. 6GB వరకు RAM+ 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 48+12 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెన్సార్ ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. పవర్ కోసం పెద్ద 3349mAh బ్యాటరీని చూడచ్చు.